ఇక బాలు గారి మృతి పట్ల యావత్ సినీ, సంగీత ప్రపంచం దిగ్భ్రాంతి వ్యక్తంచేసింది. ఆయన మృతి పట్ల సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖులు సంతాపం తెలిపారు. ఒక మహోన్నత గాయకుడిని దేశం కోల్పోయిందని విచారం వ్యక్తం చేశారు.బాలు గారు ఇక లేరు అనే వార్త యావత్ ప్రపంచంలో బ్రతికి వున్న కొన్ని కోట్లాది మంది తెలుగు ప్రేక్షకులకు తీరని లోటుగా మిగిలిపోయింది. కరోనా తో ఆగష్టు 4 న చెన్నై లోని ఎంజీఎం ఆసుపత్రి లో చేరిన బాలు గారు తరువాత నెగటివ్ వచ్చి కోలుకున్నారు. మళ్ళీ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో మొన్న 1.04 గంటలకు తుదిశ్వాస విడిచారు. కరోనా నుంచి కోలుకున్న ఇతర ఆరోగ్య సమస్యల కారణంగా బాలు ఆసుపత్రి లోనే చికిత్స పొందుతూ మరణించారు. నిన్న అంత్యక్రియలు జరిగాయి. ఇండియా హెరాల్డ్ వివరాల్లోకి వెళితే..
కోలీవుడ్ స్టార్ తలపతి విజయ్ ఎస్పీ బాలు గారి అంత్యక్రియలకు హాజరయ్యారు. ప్రభుత్వ లాంఛనాలతో బాలు అంత్యక్రియలు జరుగుతుండగా విజయ్ అక్కడకు చేరుకున్నారు. బాలు కుమారుడైన ఎస్పీ చరణ్ ని ఆయన కలిసి సంతాపం వ్యక్తం చేశారు. అత్యక్రియలకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇక బాలు పార్థివ దేహాన్ని ఆయన దర్శించడం జరిగింది. బాలుగారికి విజయ్ నివాళులు అర్పించారు. బాలు అకాల మరణానికి విజయ్ భావోద్వేగానికి గురయ్యారు. విజయ్ నటించిన అనేక సినిమాలలో పాటలను బాలు పాడడం జరిగింది.
ఇక చెన్నైలో ఉన్న చిత్ర ప్రముఖులు బాలు అంత్యక్రియలకు హాజరు అయ్యారు. కరోనా నేపథ్యంలో వయసు రీత్యా కొందరు బాలు అంతిమ సంస్కారాలకు హాజరు కాలేకయ్యారు. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ బాలు అంత్యక్రియలకు హాజరు అయ్యారు. ఆయన బాలు పార్దీవ దేహాన్ని సందర్శించడంతో పాటు, బాలుతో తనకు గల అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. సంగీత దర్శకులు, సింగర్స్, పాటల రచయితలు అందరి తరపున బాలు గారికి తాను నివాళులు అర్పిస్తున్నట్లు దేవి శ్రీ ప్రసాద్ తెలియజేశారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి