ఇండియా హెరాల్డ్ అందిస్తున్న పూర్తి వివరాల్లోకి వెళితే.. బిగ్‌బాస్‌ ఇంట్లో తెలుగే మాట్లాడాలని నియమాల్లో రాసి ఉంది. దాన్ని పాటించకపోతే బిగ్‌బాస్‌ ఎప్పటికప్పుడు చెబుతుంటాడు. అవసరమైతే వార్నింగ్ ఇస్తాడు. ఈ సీజన్‌లో కూడా బిగ్‌బాస్‌ అదే పని చేశాడు. అయితే ఇంట్లో అందరూ తెలుగే మాట్లాడుతున్నారా అంటే లేదనే చెప్పాలి. తెలుగు వచ్చినా ఇంట్లో తెలుగు మాట్లాడటం లేదంటూ నాగార్జున శనివారం ఎపిసోడ్ లో అభిజీత్‌ – హారికకు పనిష్మంట్‌ వేశారు. ఆ ఎసిపోడ్‌ మొత్తం నిలబడమని చెప్పారు. ఇప్పుడు దీనిపై సోషల్‌ మీడియాలో పెద్ద చర్చే జరుగుతోంది.ఇంట్లో తెలుగులో మాట్లాడనిది ఈ ఇద్దరేనా అంటూ నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఇంట్లో చాలామంది ఇంగ్లిష్‌లో మాట్లాడుతున్నారని అంటున్నారు.
తెలుగు రాని మోనాల్‌ తెలుగులో మాట్లాడటం గొప్ప కావొచ్చు.. కానీ తెలుగు వచ్చిన అఖిల్‌ ఆమెతో ఇంగ్లీష్‌లో మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్‌ అని ప్రశ్నిస్తున్నారు. అఖిల్‌కు ఈ పనిష్మంట్‌ ఎందుకు వేయలేదని అడుగుతున్నారు. అంతేకాకుండా మోనాల్ మొదట్లో తెలుగులో చక్కగా మాట్లాడటానికి ప్రయత్నించింది కాని తరువాత అఖిల్ తో ఎక్కువ సేపు ఇంగ్లీష్ లో సొల్లు కబుర్లు ఎక్కువగా మాట్లాడుతుంది అని చాలా తీవ్రంగా కామెంట్స్ చేస్తూ మండిపడుతున్నారు నెటిజన్స్.. హౌస్ లో తెలుగు వచ్చిన హౌస్ మేట్స్ ఉన్నా కూడా  తెలుగు నేర్చుకొని మాట్లాడడానికి ప్రయత్నించకుండా ఆమె ఇంగ్లీష్ లోనే మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్‌ అని నెటిజన్స్ అడుగుతూ కోప్పడుతున్నారు కూడా. ఈ విషయం పట్ల అఖిల్, మోనాల్ పై నెటిజన్లు తీవ్రంగా తారాస్థాయిలో మండిపడుతున్నారు.

ఇక శనివారం ఎపిసోడ్‌లో నాగార్జున ఈ టాపిక్‌ తీసుకురాగానే అభిజీత్‌, హారిక చక్కగా స్పందించారు. నెటిజన్ల మనసులు గెలుచుకున్నారు. వీళ్లిద్దరు కూడా ఆ సమయంలో ఇంగ్లిష్‌లో మాట్లాడటం తప్పేనని ఒప్పుకున్నారు. అయితే అప్పటి ఫీలింగ్స్‌ను వెంటనే తెలుగులోకి అనువదించుకొని చెప్పడంలో ఇబ్బంది వల్ల ఇంగ్లిష్‌లో మాట్లాడానని అభిజీత్‌ స్పష్టం చేశాడు.అభిజీత్ ఇచ్చిన ఈ సమాధానానికి అయితే నెటిజన్లు శభాష్ అభిజీత్ అని మెచ్చుకుంటున్నారు కూడా. ఇంకొకసారి ఇలా బిగ్‌బాస్‌ రూల్స్‌ అతిక్రమించమని మాట కూడా ఇచ్చారు. దీనిని కూడా నెటిజన్లు మెచ్చుకుంటున్నారు. కాగా శనివారం ఎపిసోడ్ లో వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇచ్చిన స్వాతి దీక్షిత్ ఎలిమినేట్ అయ్యింది.

మరింత సమాచారం తెలుసుకోండి: