టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి మాటకారి తనం ఉన్న రచయితలలో కోన వెంకట్ అగ్రగణ్యుడు అని అంటారు. ఎలాంటి వ్యక్తిని అయినా తన మాటల గారడీతో బుట్టలో పడేసుకోగల ఈ రచయితకు టాప్ హీరోలందరితోను మంచి సాన్నిహిత్యం ఉంది. పవన్ కళ్యాణ్ తో ఎప్పటికైనా ఒక సినిమా తీయాలి అని కలలుకనే కోన వెంకట్ కు ప్రస్తుతం నడుస్తున్న కాలం ఏమాత్రం కలిసిరావడం లేదు.
ఒకప్పుడు రచయితగా చాల బిజీగా ఉండే కోన వెంకట్ ఇండస్ట్రీలో తనకు అవకాశాలు తగ్గడంతో తానే ఒక సొంత బ్యానర్ ను క్రియేట్ చేసుకుని కొన్ని ప్రముఖ నిర్మాణ సంస్థలతో భాగసామ్యంతో సినిమాలు తీసేపని గత కొన్ని సంవత్సరాలుగా కొనసాగిస్తున్నాడు. అయితే ఈప్రయత్నాలలో కోనవెంకట్ కు పరాజయాల సంఖ్య పెరిగిపోతు వస్తోంది.
‘పండగ చేస్కో’ తరువాత ఆయన ప్రమేయం ఉన్న సినిమాల్లో పేరు నిలబెట్టింది ‘నిన్నుకోరి’ మాత్రమే అన్నది వాస్తవం. కోనవెంకట్ ప్రమేయం ఉన్న ‘సాహసం శ్వాసగా సాగిపో’ ‘శంకరాభరణం’ ‘సౌఖ్యం’ ‘బ్రూస్లీ’ ‘డిక్టేటర్’ ‘వెంకీ మామ’ సినిమాలు అన్నీ చెప్పుకోతగ్గ విజయాన్ని సాధించ లేకపోయాయి. దీనితో కోనవెంకట్ లేటెస్ట్ గా విడుదలైన ‘నిశ్శబ్దం’ పై చాల ఆశలు పెట్టుకున్నాడు.
వాస్తవానికి ఈ సినిమాకు ఏర్పడిన విపరీతమైన హైక్ రీత్యా ఈమూవీ పై అమెజాన్ ప్రైమ్ కూడ చాల ఆశలు పెట్టుకుని ఈమూవీని సుమారు 30 కోట్ల భారీ మొత్తానికి కొనుగోలు చేసింది. ఈమూవీ సక్సస్ అయితే ఈమూవీ ప్రభావంతో తమ సంస్థ సభ్యత్వాలు తెలుగు రాష్ట్రాల నుంచి బాగా పెరుగుతాయని అమెజాన్ ఎన్నో ఆశలు పెట్టుకుంది. అయితే అందరి అంచనాలు తారుమారు చేస్తూ ఈమూవీ ఫ్లాప్ గా మారడంతో అమెజాన్ తో పాటు కోనవెంకట్ ఈ మూవీ నిర్మించిన పీపుల్స్ మీడియా సంస్థలు షాక్ అయినట్లు సమాచారం. ఇప్పటికే కోనవెంకట్ తో కలిసి రెండు సినిమాలు చేసిన పీపుల్స్ మీడియా సంస్థ ఇక భవిష్యత్ లో కోనను నమ్మి సినిమాలు చేసే ఆస్కారం లేదు అని అంటున్నారు. ఏది ఏమైనా ‘నిశ్శబ్దం’ కోనవెంకట్ ను కూడ ‘నిశ్శబ్ధం’ గా మార్చేసింది..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి