ఈనెల 23న ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఆయన సినిమాలనుంచి వచ్చే సర్ ప్రైజ్ ల గురించే అందరు మాట్లాడుకుంటున్నారు. అయితే ఆయన రియల్ లైఫ్ గురించి కూడా ఈ పుట్టినరోజున ఓ స్పెషల్ సర్ ప్రైజ్ ఉంటుందని విశ్వసనీయ వర్గాల సమాచారం. గతేడాది పుట్టినరోజున ఆయన పెళ్లి వార్త కుటుంబ సభ్యులు చెబుతారని అందరూ అనుకున్నా అది సాధ్యపడలేదు. అయితే ఈ ఏడాది కచ్చితంగా ప్రభాస్ పెళ్లికి సంబంధించి ఓ ఇంట్రస్టింగ్ అప్ డేట్ వస్తుందని తెలుస్తోంది.
ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా కృష్ణంరాజు ఈ విషయంపై క్లారిటీ ఇస్తారని అంటున్నారు. ప్రభాస్ పెళ్లి ఎప్పుడు జరుగుతుంది, వధువు ఎవరు అనే విషయంపై ఆయన మాట్లాడతారని, ప్రస్తుతానికి ఆ విషయాన్ని సస్పెన్స్ గా ఉంచారని అంటున్నారు. లాక్ డౌన్ టైమ్ లో నితిన్, రానా, నిఖిల్.. వంటి చాలమంది పెళ్లి చేసుకుని వివాహ బంధంలోకి అడుగు పెట్టారు. మరికొంతమంది ఎంగేజ్ మెంట్ వరకు వచ్చారు. అయితే టాలీవుడ్ కి సంబంధించి ప్రభాస్ పెళ్లి మాత్రం అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న అంశం.
టాలీవుడ్ బ్యాచ్ లర్స్ అందరూ ఒక్కొక్కరే ఓ ఇంటివారవుతున్నారు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ మాత్రం ఇంకా తాను సింగిలేనని చెబుతున్నారు. బాహుబలి తర్వాత ప్రభాస్ పెళ్లిపై కుటుంబ సభ్యులు క్లారిటీ ఇస్తారనుకున్నా.. అది వెనక్కు వెళ్లిపోతూనే ఉంది. అనుష్కతో అదిగో పెళ్లి, ఇదిగో పెళ్లి అంటూ ఎన్ని పుకార్లు వచ్చినా.. వాటిని ఇద్దరూ తేలిగ్గా తీసిపారేశారు.
మరింతకీ ప్రభాస్ కి తగ్గ వధువు ఎవరు? ఎక్కడుంది? ఏం చేస్తోంది. అనుష్క కాకుండా కొన్నాళ్లు.. మరికొంతమంది పేర్లు కూడా వినిపించాయి. అసలు ప్రభాస్ మ్యారేజ్ అని సెర్చ్ చేస్తే.. గూగుల్ లో కావాల్సినంత వైరల్ న్యూస్ దొరుకుతుంది. ప్రభాస్ పక్కన పెళ్లి కూతురు ఫొటో బ్లర్ చేసి.. రకరకాల వార్తలు వండి వార్చాయి యూట్యూబ్ ఛానెళ్లు. ప్రభాస్ పెళ్లితో లింక్ పెట్టి రాసిన ఏ వార్తకయినా రేటింగ్ అదిరిపోతుంది. అయితే త్వరలోనే వీటన్నిటికీ చెక్ పెట్టబోతున్నారు ప్రభాస్ కుటుంబ సభ్యులు. ఈ పుట్టినరోజున అసలు విషయం తేల్చేయబోతున్నారు. సో ప్రభాస్ ఫ్యాన్స్.. ఆ ఇంట్రస్టింగ్ న్యూస్ వినడానికి మీరు రెడీయా..?

మరింత సమాచారం తెలుసుకోండి: