ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి...
దాదాపు ఏడు నెలలుగా మూసి ఉన్న థియేటర్లు ఈ నెల 15న తెరుచుకున్నాయి. ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో థియేటర్లు మూతపడే ఉన్నాయి. కేంద్రం, రాష్ట్రం థియేటర్లు తెరుచుకునే పర్మిషన్లు ఇచ్చినా.. చాలా వరకు థియేటర్లు మాత్రం తెరవలేదు. దానికి కారణం కేంద్రం విధించిన నిబంధనలే. కేవలం యాభై శాతమే కెపాసిటీతో నడిపించాలని కేంద్రం షరతులు విధించింది. కానీ అలా రన్ చేస్తే నష్టాలే తప్ప లాభాలు ఉండవని కొందరు ఎగ్జిబిటర్లు వెనకడుగు వేశారు. కేవలం మల్టీప్లెక్స్ లు, పెద్ద సంస్థలు మాత్రమే స్క్రీన్లను తెరిచాయి. కానీ వాటిలో సినిమాలు పెద్దగా నడవడం లేదు.

పాత సినిమాలను వేయలేక.. కొత్త సినిమాలు రాక ఇబ్బంది పడుతున్నారు. అందుకే ఐనాక్స్ సంస్థ ఓ కొత్త ఐడియాతో ముందుకొచ్చింది. తమ మల్టీప్లెక్స్ లలో స్క్రీన్లను జనాలకు రెంట్ కి ఇవ్వాలని నిర్ణయించింది ఐనాక్స్ యాజమాన్యం. మొత్తం స్క్రీన్ ను బుక్ చేసుకొని.. తమకు నచ్చిన సినిమాలు అందులో ప్రదర్శించుకునే అవకాశం కల్పిస్తుంది. అలానే సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వారు తమ సినిమా ఈవెంట్లు, ప్రెస్ మీట్ లను ఏర్పాటు చేసుకోవచ్చని చెబుతున్నారు. వీటితో పాటు స్నేహితులు, కుటుంబ సభ్యులతో గెట్ టు గెదర్ లు కూడా ఏర్పాటు చేసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నారు.

ప్రేక్షకులకు నచ్చితే పుట్టినరోజు వేడుకలు, స్పోర్ట్ ఈవెంట్లు కూడా నిర్వహించుకోవచ్చు. ప్రస్తుతం స్క్రీన్లన్నీ కూడా ఖాళీగా ఉండడం.. కొత్త సినిమాలు ఎప్పుడు రిలీజ్ అవుతాయో తెలియకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఒకట్రెండు స్క్రీన్లలో సినిమాలను నడిపించి.. మిగిలిన స్క్రీన్లను ప్రైవేట్ స్క్రీనింగ్, ఈవెంట్ లకు అద్దెకివ్వాలని ప్లాన్ చేస్తోంది. ఈ విధంగానైనా థియేటర్లను మైంటైన్ చేయొచ్చనేది ఆలోచన. మరి ఈ ప్లాన్ ఎంతవరకు వర్కవుట్ అవుతుందో చూడాలి! ఇలాంటి మరిన్ని మూవీస్ కి సంబందించిన ఆర్టికల్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి...

మరింత సమాచారం తెలుసుకోండి: