ఈ మధ్యకాలంలో తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రేక్షకులకు పంథా  మొత్తం మారిపోతుంది. ఒకప్పుడైతే మామూలుగా స్టార్ హీరోల సినిమాలను ఎక్కువగా ఆదరిస్తూ బ్లాక్బస్టర్ విజయాలను అందించేవారు.  కానీ నేటి రోజుల్లో మాత్రం ప్రేక్షకులు ఆలోచన తీరు పూర్తిగా మారిపోయింది. చిన్న హీరో సినిమా నా పెద్ద హీరో సినిమానా  అని ప్రేక్షకులు ప్రస్తుతం చూడటం లేదు. సినిమాలో మంచి కంటెంట్ ఉండి  కథ బలంగా ఉంటే ఆ సినిమాను ఆదరిస్తూ మంచి విజయాన్ని అందిస్తున్నారు. చిన్న చిన్న సినిమాలు భారీ విజయాలు అందుకున్న విషయం తెలిసింది. దీంతో అటు దర్శకులు నిర్మాతలు కూడా చిన్న సినిమాలే అయినప్పటికీ కథ బలంగా ఉంటే మంచి విజయం సాధించొచ్చు అనే నమ్మకంతో ఉన్నారు.



 ఈ క్రమంలోనే ఎన్నో చిన్న సినిమాలు ప్రస్తుతం ప్రేక్షకుల ముందుకు వచ్చి మెప్పిస్తూ మంచి విజయాలు అందుకున్న విషయం తెలిసిందే. ఇటీవలే సుహాస్ హీరోగా చాందిని చౌదరి హీరోయిన్ గా సునీల్ కీలక పాత్రలో నటించిన చిత్రం కలర్ ఫోటో. పల్లెటూరి నేపథ్యంలో సాగే ప్రేమకథా చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమా ఇక నిజ జీవితానికి ఎంతో దగ్గరగా ఉండేలా దర్శకుడు ఈ సినిమాను తెరకెక్కించారు. ఇక అప్పటి వరకు పలు సినిమాలలో హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ లో  నటించిన సుహాస్ ఈ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమా ఇటీవలే ఓటీటీ వేదికగా విడుదలై మంచి టాక్ ను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.



 ఎంతో మంది సినీ ప్రముఖులు ఈ సినిమాపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. చిన్న సినిమా అయినప్పటికీ సినిమా ఎంతో అద్భుతంగా తెరకెక్కించారని ప్రతి ఒక్కరు అద్భుతంగా నటించారు అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక ఇటీవలే కలర్ ఫోటో సినిమా పై టాలీవుడ్ ప్రముఖ నటుడు జగపతి బాబు స్పందిస్తూ ప్రశంసలు కురిపించాడు. ఈ సినిమా ఎంతో  అద్భుతంగా ఉందని ఈ సినిమా చూసి తాను ఎంతగానో ఇంప్రెస్ అయ్యాను అంటూ చెప్పుకొచ్చాడు. ఒక సినిమా విజయం కావాలి అంటే భారీ బడ్జెట్ స్టార్డం మాత్రమే కారణం కాదు అన్న విషయం ఈ సినిమా నిరూపించింది అని తెలిపాడు. నటీనటులు టెక్నీషియన్లు అందరూ కలిసి ఇలాంటి సహజసిద్ధమైన సినిమాను ప్రేక్షకుల ముందుకు తెచ్చి మంచి విజయం అందుకోవడం ఆశ్చర్యానికి గురి చేసింది అంటూ జగపతి బాబు తెలిపాడు.మరి కొంతమంది సినీ ప్రముఖులు కూడా కలర్ ఫోటో సినిమాపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇలాంటి సహజసిద్ధమైన సినిమాను చూసి చాలా రోజులు అయింది అంటూ ప్రశంసిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: