గత కొద్దిరోజులుగా బంగారం ధర రోజురోజుకు తగ్గుతూ 49 వేల దిగువకు చేరుకోవడంతో బంగారం తిరిగి 45 వేల మార్క్ కు చేరుతుందా అన్న ఆశలు చాలామందిలో కలుగుతున్నాయి. ఇలా బంగారం ధర రోజురోజుకు తగ్గడానికి కొన్ని ఆసక్తికర కారణాలు కనిపిస్తున్నాయి. డాలర్ తో పోలిస్తే రూపాయి మారకం విలువ బలపడటం అంతర్జాతీయ మార్కెట్ లో అతి విలువైన లోహాల ధరలు తగ్గుతూ ఉండటంతో దేశీయంగా బంగారం ధర తగ్గుతోంది అని విశ్లేషకులు చెపుతున్నారు.
 
 
 పసిడి తో పాటు వెండి ధరలు కూడ బాగా తగ్గుతున్నాయి. వెండి నాణాల తయారి వెండి వస్తువుల తయారీ ప్రస్తుతం నిలిచి పోయినట్లు తెలుస్తోంది. దీనికి కారణం ప్రస్తుతం కరోనా సమస్యలు వల్ల పెళ్ళిళ్ళకు వచ్చే అతిధుల సంఖ్య బాగా తగ్గిపోవడంతో అతిధులకు గిఫ్ట్స్ గా ఇచ్చే వెండి నాణాలు వెండి వస్తువుల కొనుగోళ్ళు తగ్గిపోవడంతో వెండి ధర బాగా దిగి వస్తోంది.
 
 
 
 దీనికితోడు కరోనా వ్యాక్సిన్ త్వరలో అందరికీ అందుబాటులోకి వస్తుంది అన్న సంకేతాలు రావడంతో పాటు త్వరలో ఎటువంటి సమస్యలు లేకుండా బైడెన్ వైట్ హౌస్ ఎంట్రీకి ట్రంప్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ప్రపంచంలో ఎక్కడా అనిశ్చిత పరిస్థితులు కనిపించక పోవడంతో చాలామంది షేర్ మార్కెట్ వైపు పెట్టుబడులు పెట్టడానికి ఆశక్తి కనిపిస్తున్నారు. దీనితో బంగారం పై పెట్టవలసిన పెట్టుబడులు అంతా షేర్ మార్కెట్ వైపు మల్లుతున్నాయి.
 
 
 ఈ పరిస్థితులు ఇలా ఉండగా అమెరికా ఆసియా ఐరోపా దేశాలలోని స్టాక్ మార్కెట్లు కూడ పరుగులు తీస్తున్న పరిస్థితులలో నిఫ్టీ చరిత్రలోనే తొలిసారిగా 13 వేల పాయింట్ల చేరుకొని చరిత్ర సృష్టించింది. ప్రస్తుతం ఆసియా యూరప్ మార్కెట్ లోని ఇన్వెష్టర్లు కూడ భారత్ షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టేందుకు తమ ఆశక్తిని కనపరుస్తున్నాయి. కేవలం ఒక సంవత్సర కాలంలో అంతేకాకుండా ముఖ్యంగా 14 ట్రేడింగ్ సెషన్స్ లో నిఫ్టీ 1000 పాయింట్లు పెరగడం ఒక చరిత్ర కావడంతో దాని ప్రభావం బంగారం ధరల పై పడుతోంది..

మరింత సమాచారం తెలుసుకోండి: