సినిమా అనే రంగుల ప్రపంచంలో అడుగు పెట్టక అవకాశాలు వచ్చిన రాకపోయినా అదే చట్రం లో తిరుగు ఉంటారు. ఒకప్పుడు హీరో గా కెరీర్ మొదలు పెట్టి అవకాశాలు లేకపోవడం తో సహాయక పాత్రల్లో నటిస్తూ చివరికి సీరియల్స్ చేస్తున్న హీరోలు కూడా ఉన్నారు. అదే దోవలోకి వస్తాడు నిన్నటి తరం హీరో సురేష్. నిజానికి సురేష్ ఒక్క నటుడే కాదు మల్టి టాలెంటెడ్. సినిమాలకు దర్శకత్వం వహించాడు అలాగే ప్రొడ్యూసర్ గా మారి నిర్మాణం చేపట్టాడు. ఇలా సురేష్ అన్ని విభాగాల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు.  సురేష్ తన కెరీర్ మొత్తంలో  270 పైగా సినిమాల్లో నటించాడు.

ఆగస్టు 26 న  1963 లో శ్రీ కాళహస్తిలో జన్మించిన సురేష్ తల్లి తండ్రులు గోపినాధ్, రాధా దేవిలు. ఇక సురేష్ బాబు తాతగారు సైతం సినిమాలకు పాటలు, పద్యాలు రాసేవారు. హీరో గా సురేష్ కి తొలినాళ్లలో ప్రేక్షకుల ఆదరణ బాగానే పొందిన కొన్నాళ్ల తర్వాత అవకాశాలు తగ్గి విలన్ గా సహాయక పాత్రల్లో నటించాడు. ఒక్క వెండి తెర పైననే కాకుండా బుల్లి తెర పై కూడా నటించి తాను అందరివాడిని అనిపించుకున్నాడు. మొదట తమిళ సినిమా అయినా పన్నీర్ పుష్కాన్గలం లో 1981 లో నటించి వెండి తెరకు పరిచయం అయ్యాడు. ఇక ఇదే సంవత్సరం తెలుగు లో సైతం రామదండు అనే సినిమాతో డెబ్యూ చేసాడు.
 
ప్రొడ్యూసర్ గా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా

తెలుగు, తమిళ భాషల్లో వరస చిత్రాల్లో నటించిన సురేష్ 2002 వ సంవత్సరంలో రాఘవ అనే చిత్రాన్ని నిర్మించాడు. ఇక సురేష్ బాబు పక్క హీరోలకు తన గాత్రాన్ని సైతం ఇచ్చాడు. ఇక సినిమాల్లో బిజీగా ఉన్న సమయంలో ఒక కొడుకు పుట్టాక భార్య అనిత తో విడాకులు తీసుకున్నాడు. విడిపోయాక ఇద్దరు వేరు వేరు వివాహాలు చేసుకున్నారు. భార్య తో విడాకులు తీసుకున్న కూడా కొడుకు నిఖిల్ ని మాత్రం తానే పెంచుకున్నాడు.

రెండో పెళ్లి

కొడుకు ఆలనా పాలన చూడటానికి సురేష్ రాజేశ్వరి అనే అమ్మాయిని మల్లి పెళ్లి చేసుకున్నాడు. ఆమె కూడా క్రియేటివ్ మైండ్ సెట్ కలిగిన వ్యక్తి కావడంతో బుల్లి తెరపై సీరియల్స్ నిర్మాణం చేపట్టారు. అంతే కాదు అనేక సీరియల్స్ ఆమె స్క్రిప్ట్ రైటర్ గా కూడా పని చేసారు. రాజేశ్వరీ కల్యాణం, నాటకం, మై నేమ్ ఈజ్ మంగతాయారు, మా ఇంటి మహాలక్ష్మి వంటి 7 సీరియల్స్ ని నిర్మించారు. ఇక సురేష్ మొదటి భార్య అనిత మరొక పెళ్లి చేసుకొని వెళ్లిపోగా , వీరిద్దరూ ఎప్పుడు మాట్లాడుకుంటారట. అవకాశం ఉంటె వారింటికి వెళ్తుంటానని ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకోచ్చారు సురేష్

మరింత సమాచారం తెలుసుకోండి: