ప్రస్తుతం రాధేశ్యామ్ సినిమాలో
రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే.
యువ దర్శకుడు
రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో
ప్రభాస్ కి జోడీగా పూజాహెగ్డే నటిస్తుండగా గోపి
కృష్ణ మూవీస్, యు.వి.క్రియేషన్స్ సంస్థలు ఈ సినిమాని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాయి. ఈ
సినిమా వచ్చే ఏడాది వేసవి కానుకగా రిలీజ్ కానుంది. ఇకపోతే దీని తర్వాత
వైజయంతి మూవీస్ బ్యానర్ పై
నాగ అశ్విన్ దర్శకత్వంలో
ప్రభాస్ ఒక
సినిమా చేయనున్నారు.

దీపికా పదుకొనే
హీరోయిన్ గా నటించనున్న ఈ సినిమాలో
అమితాబ్ బచ్చన్ ప్రత్యేక పాత్ర చేయనున్నారు. దీని అనంతరం
బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వం లో హిస్టారికల్ డ్రామా మూవీని కూడా
ప్రభాస్ చేయనున్నారు. ఇక వీటి అనంతరం తదుపరి
ప్రభాస్ నటించబోయే సినిమాకు సంబంధించి అఫీషియల్ అనౌన్స్మెంట్ కొద్దిసేపటి క్రితం రావడం జరిగింది. ఇటీవల కే జి ఎఫ్ చాప్టర్ 1
సినిమా తో అతిపెద్ద స్థాయి విజయం అందుకున్న
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో
ప్రభాస్ పక్కా
మాస్ రోల్ లో నటించనున్న ఈ సినిమాకి 'సలార్' అనే టైటిల్ని నిర్ణయించారు.
ప్రస్తుతం
ప్రశాంత్ తెరకెక్కిస్తున్న కే జి ఎఫ్ చాప్టర్ 2 రిలీజ్ అనంతరం ఈ
సినిమా పట్టాలెక్కనున్నట్లు తెలుస్తోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిలిమ్స్ బ్యానర్ పై దాదాపు రూ. 700 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో వరల్డ్ క్లాస్ అత్యున్నత టెక్నాలజీతో అత్యధిక స్థాయి భారీ నిర్మాణ విలువలతో తెరకెక్కనున్న ఈ
సినిమా గురించిన పూర్తి వివరాలు అతి త్వరలో వెల్లడి కాబోతునట్లు తెలుస్తున్నాయి ఇకపోతే కొద్దిసేపటి క్రితం ఈ
సినిమా అనౌన్స్మెంట్ రావడంతో ఒక్కసారిగా
ప్రభాస్ అభిమానుల్లో అమితానందం వెల్లివిరుస్తోంది...... !!