బీచ్ వెడ్డింగ్ కోరుకుంటున్న ముద్దు గుమ్మ
అవకాశాలు సన్నగిల్లుతున్న సమయంలో హీరోయిన్స్ ఫ్యామిలీ లైఫ్ కు టర్న్ అవ్వడం చాలా కామన్ గా జరుగుతూనే ఉంది. కాజల్ అగర్వాల్ ఈ ఏడాది పెళ్లి పీఠలు ఎక్కేసింది. ఆఫర్లు తగ్గడం వల్లే ఆమె పెళ్లికి సిద్దం అయ్యింది అనడంలో సందేహం లేదు. ఆమె తర్వాత ఎవరు పెళ్లికి సిద్దం అవుతారు అంటూ తెలుగు ప్రేక్షకులు ఎదురు చూస్తున్న సమయంలో 30 ఏళ్ల రకుల్ ప్రీత్ సింగ్ తాను ప్రేమ పెళ్లికి వ్యతిరేకిని కాదు. వాటిపై నాకు నమ్మకం ఉంది. కనుక పెళ్లి చేసుకుని జీవితంలో మంచి జీవితాన్ని గడపాలనే కోరిక నాకు కూడా ఉందని చెప్పుకొచ్చింది.ఇక పెళ్లి విషయంలో తనకు కొన్ని కండీషన్స్ ఉన్నాయంటూ ఒక జాబితాను ముందు పెట్టింది. తాను పెళ్లి చేసుకోబోయే వ్యక్తి సాంప్రదాయానికి కుటుంబానికి విలువనివ్వాలి. హెల్తీ లైఫ్ స్టైల్ కలిగి ఉండటంతో పాటు అన్ని విషయాల్లో కూడా మంచి నిర్ణయాలు తీసుకోగల సామర్థ్యం ఉండాలి అంది. ఇక తన పెళ్లి సాంప్రదాయబద్దంగా బంధు మిత్రులు సన్నిహితులు ఇలా అందరి సమక్షంలో డెస్టినేషన్ వెడ్డింగ్ లా అది కూడా బీచ్ లో జరగాలని ఆశిస్తున్నాను అంది. బీచ్ లో డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ అంటే మామూలుగా ఉండదు. మరి రకుల్ ఆ కళ నెరవేర్చుకుంటుందా.. ఆమె కోరిక నెరవేర్చేవాడు వస్తాడా అనేది చూడాలి