స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అల వైకుంఠపురములో సినిమా సెన్సేషనల్ హిట్ అయిన విషయం తెలిసిందే. త్రివిక్రం డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమాలో బన్నీ సరసన పూజా హెగ్దే హీరోయిన్ గా నటించింది. అల వైకుంఠపురములో సినిమా నాన్ బాహుబలి రికార్డులను కొల్లగొట్టింది. ఈ ఇయర్ బ్లాక్ బస్టర్ మూవీస్ లో ఒకటైన అల వైకుంఠపురములో సినిమా తెలుగులోనే కాదు తమిళంలో కూడా హిట్ అనిపించుకుంది.

తమిళ వర్షన్ వైకుంఠపురములో సినిమా సన్ నెక్స్ట్ లో రిలీజైంది. తమిళ ఆడియెన్స్ కూడా ఈ సినిమాను చూసి సూపర్ అనేశారు. అల్లు అర్జున్ ఎనర్జీ, పర్ఫార్మెన్స్, డ్యాన్స్ అన్నిటిలో సూపర్ అనేస్తున్నారు తమిళ ఆడియెన్స్. ఆల్రెడీ మళయాళంలో అల్లు అర్జున్ కు స్టార్ ఇమేజ్ ఉంది. ఇప్పుడు కోలీవుడ్ లో కూడా అల్లు అర్జున్ కు అలాంటి క్రేజ్ వచ్చేలా ఉంది. కేరళలో ఆల్రెడీ అల్లు అర్జున్ పేరు మీద అభిమాన సంఘాలు ఏర్పడ్డాయి.

చూస్తుంటే అల్లు అర్జున్ పుష్పకు ఇది మంచి ఛాన్స్ అని చెప్పొచ్చు. సుకుమార్ డైరక్షన్ లో వస్తున్న అల్లు అర్జున్ పుష్ప సినిమా పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో పుష్ప రాజ్ పాత్రలో అల్లు  అర్జున్ కనిపించనున్నారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో కన్నడ భామ రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుందని తెలుస్తుంది. ఆల్రెడీ సెట్స్ మీద ఉన్న ఈ సినిమా 2021 సెకండ్ హాఫ్ లో రిలీజ్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: