సోనూ సూద్.. ఈ పేరు ప్రస్తుతం తెలియని వాళ్ళు ఉండరేమో ఎందుకంటే కష్టం అన్న వారికి తనకు తోచిన సాయాన్ని అందించడంలో ముందుంటాడు. పాన్ ఇండియా హీరోగా అందరికి తెలుసు.. కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో ఈయన చేసిన సాయం వర్ణానాతీతం.ఆసరాను కోల్పోయి నడిరోడ్డున పడిన అభాగ్యుల కళ్ళల్లో సంతోషాన్ని నింపాడు. ముఖ్యంగా వలస కార్మికుల పాలిట దైవంగా నిలిచారు. ఎవరైనా సాయం కోరితే వారికి కావలసిన సాయాన్ని అందించారు.. రీల్ హీరో కాస్త రియల్ హీరో అయ్యాడు.  



సోషల్ మాధ్యమాల ద్వారా ఎవరైనా సాయం కోరారంటే లేదు, కాదు అనకుండా చిటికెలో సాయాన్ని అందిస్తున్నారు. ముఖ్యంగా విద్యార్థులు అడిగిన కోరికలను ఎన్నో ఆయన తీర్చి పిల్లల పాలిట దేవుడు అయ్యాడు. మొన్నీ మధ్య ఆన్ లైన్ క్లాసుల నెట్ వర్క్ సమస్య ఉందని కోరితే ఏకంగా ఎయిర్ టెల్ సెల్ టవర్ ను ఏర్పాటు చేశారు. ఇటీవల సోనూ సూద్ ఓ ప్రకటన చేశాడు. చిన్న పిల్లలకు గుండె ఆపరేషన్లు కూడా చేయిస్తానని చెప్పాడు. ఇప్పటికే చాలా మంది చిన్నారులకు సర్జరీలు చేయించారు.



ఇది ఇలా ఉండగా కరోనా వల్ల చాలా మంది ఉపాధిని కోల్పోయారు. అలాంటి వారికి పిల్లల చదువుకు భారం కాకూడదు అంటూ ప్రైవేట్ స్కూళ్ల యాజమాన్యాలను కోరారు. పేద విద్యార్థులు ఈ ఏడాది ఫీజులు కట్టకపోయినా వారికి విద్యను అందించాలని విద్యాశాఖ ను కోరారు.ఇప్పుడు మరోసారి చిన్నారుల కోరికను తీర్చి పెద్దమనసును చాటుకున్నారు. మహారాష్ట్రా లోని కోపర్ గావ్‌లో ఆరు స్కూళ్లకు చెందిన విద్యార్థుల కోసం 100 స్మార్ట్‌ ఫోన్లను బహుమతిగా ఇచ్చాడు. దీంతో ఆ చిన్నారులు ఆన్‌లైన్‌ చదువులకు హాజరవుతున్నారు. ఇక సోనూ సేవా గుణంతో సదరు తల్లిదండ్రులు చేతులెత్తి దండాలు పెడుతున్నారు . అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి..

మరింత సమాచారం తెలుసుకోండి: