తెలుగు ప్రజలకి సంక్రాంతి అనేది చాలా పెద్ద పండుగ. ఈ పండుగకు ముగ్గులు - గొబ్బెమ్మలు, గంగిరెద్దులు - హరిదాసులు, కోడి పందాలు - ఎడ్ల పందాలు అనేవి చాలా కామన్ గా కనిపిస్తూ ఉంటాయి. అయితే తెలుగు ప్రజలకు సంక్రాంతికి సినిమాలు కూడా తమ జీవితంలో భాగం అయిపోయాయి. ఇప్పటి నుంచి కాదు చాలా ఏళ్ల నుంచి సంక్రాంతికి సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ప్రతి ఏడాది సంక్రాంతి కనీసం మూడు సినిమాలైనా రిలీజ్ అవుతాయి. ఎన్ని సినిమాలు రిలీజ్ అయినా కేవలం ఒక్కటి మాత్రమే సంక్రాంతికి విన్నర్ గా నిలుస్తుంది. 2001 సంవత్సరం నుంచి 2021 వరకు రిలీజ్ అయిన సమ్మర్ సంక్రాంతి మూవీస్ లో ఏ ఏడాది ఏఏ సినిమా విన్నర్ గా నిలిచిందో చూద్దాం.

2001 : ఈ ఏడాది బాలకృష్ణ నటించిన నరసింహ నాయుడు, చిరంజీవి నటించిన మృగరాజు అలానే వెంకటేష్ నటించిన దేవి పుత్రుడు సినిమాలు రిలీజ్ అయ్యాయి. వీటిలో బాలకృష్ణ నరసింహనాయుడు సంక్రాంతి విన్నర్ గా నిలిచింది.

2002 : ఈ ఏడాది తరుణ్ నటించిన నువ్వు లేక నేను లేను, బాలయ్య నటించిన సీమ సింహం అలానే మహేష్ బాబు నటించిన టక్కరి దొంగ సినిమాలు రిలీజ్ కాగా తరుణ్ నటించిన నువ్వు లేక నేను లేను సినిమా విన్నర్ గా నిలిచింది.

2003 : ఈ ఏడాది మహేష్ బాబు నటించిన ఒక్కడు, రవితేజ నటించిన ఈ అబ్బాయి చాలా మంచోడు, శ్రీకాంత్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన పెళ్ళాం ఊరెళితే సినిమాలు రిలీజ్ కాగా, మహేష్ బాబు ఒక్కడు సినిమా విన్నర్ గా నిలిచింది.

2004 : ఈ ఏడాది ప్రభాస్ నటించిన వర్షం, బాలకృష్ణ నటించిన లక్ష్మీ నరసింహ, జూనియర్ ఎన్టీఆర్ నటించిన ఆంధ్రావాలా, చిరంజీవి నటించిన అంజి సినిమాలు రిలీజ్ కాగా ఇందులో వర్షం అలాగే లక్ష్మీ నరసింహ సినిమాలు రెండు విన్నర్స్ గా నిలిచాయి.

2005 : ఈ ఏడాది సిద్ధార్థ హీరోగా నటించిన నువ్వొస్తానంటే నేనొద్దంటానా, జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన నా అల్లుడు, సుమంత్ నటించిన ధన 51 సినిమాలు రిలీజ్ అయ్యాయి. అయితే వీటిలో సంక్రాంతి విన్నర్ గా నువ్వొస్తానంటే నేనొద్దంటానా సినిమా నిలిచింది.

2006 : ఈ ఏడాది వెంకటేష్ హీరోగా తెరకెక్కిన లక్ష్మి, రామ్ హీరోగా తెరకెక్కిన దేవదాసు, రాఘవ లారెన్స్, ప్రభుదేవా నటించిన స్టైల్, అలానే సిద్ధార్థ్ హీరోగా నటించిన చుక్కల్లో చంద్రుడు సినిమాలు రిలీజ్ కాగా అందులో లక్ష్మీ, దేవదాసు రెండు సినిమాలు విన్నర్స్ గా నిలిచాయి.

2007 : ఈ ఏడాది ఇది అల్లు అర్జున్ హీరోగా నటించిన దేశముదురు, ప్రభాస్ హీరోగా నటించిన యోగి, అలానే సచిన్ హీరోగా నటించిన బ్రహ్మ సినిమాలు రిలీజ్ కాగా దేశముదురు హిట్ గా నిలిచింది.

2008 : ఈ ఏడాది రవితేజ హీరోగా కృష్ణ, బాలకృష్ణ హీరోగా ఒక్కమగాడు, సుమంత్ హీరోగా పౌరుడు అనే సినిమాలు విడుదలవ్వగా రవితేజ హీరోగా నటించిన కృష్ణ సినిమా విన్నర్ గా నిలిచింది.

 2009 : ఈ ఏడాది అనుష్క ప్రధాన పాత్రలో నటించిన అరుంధతి, రామ్ హీరోగా తెరకెక్కిన మస్కా సినిమా రిలీజ్ కాగా అరుంధతి సినిమా విన్నర్ గా నిలిచింది

2010 : ఈ ఏడాది జూనియర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన అదుర్స్, రవితేజ హీరోగా తెరకెక్కిన శంభో శివ శంభో, నవదీప్ హీరోగా తెరకెక్కిన ఓం శాంతి, అలాగే వెంకటేష్ హీరోగా నమో వెంకటేశ సినిమాలు రిలీజ్ కాగా అదుర్స్ అలాగే శంభో శివ శంభో సినిమాలు విన్నర్స్ గా నిలిచాయి.

2011 : ఈ ఏడాది రవితేజ హీరోగా తెరకెక్కిన మిరపకాయ్, బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన పరమవీరచక్ర, సిద్ధార్థ హీరోగా తెరకెక్కిన అనగనగా ఒక ధీరుడు, సుమంత్ హీరోగా తెరకెక్కిన గోల్కొండ హై స్కూల్ రిలీజ్ కాగా మిరపకాయ సినిమా సంక్రాంతి విన్నర్ గా నిలిచింది.

2012 : ఈ ఏడాది మహేష్ బాబు హీరోగా నటించిన బిజినెస్ మాన్, వెంకటేష్ హీరోగా నటించిన బాడీగార్డ్, తారకరత్న హీరోగా నటించిన నందీశ్వరుడు సినిమాలు రిలీజ్ కాగా బిజినెస్ మాన్ సినిమా విన్నర్ గా నిలిచింది

2013 : ఈ ఏడాది వెంకటేష్, మహేష్ బాబు కలిసి నటించిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు అలాగే రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన నాయక్ సినిమాలు రిలీజ్ కాగా అందులో సీతమ్మవాకిట్లో సిరిమల్లెచెట్టు విన్నర్ గా నిలిచింది.

2014 : ఈ ఏడాది రామ్ చరణ్, అల్లు అర్జున్ కలిసి నటించిన ఎవడు మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన 1 నేనొక్కడినే, ప్రిన్స్ ప్రధాన పాత్రలో దొరికిన మనసును మాయ సేయకే అనే సినిమాలు రిలీజ్ కాగా ఎవడు సినిమా సంక్రాంతి విన్నర్ గా నిలిచింది.

2015 : వెంకటేష్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన గోపాల గోపాల, కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కిన పటాస్ సినిమాలు రిలీజ్ కాగా అందులో గోపాలగోపాల సంక్రాంతి విన్నర్ గా నిలిచింది.

2016 : ఈ ఏడాది జూనియర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన నాన్నకు ప్రేమతో, నాగార్జున హీరోగా తెరకెక్కిన సోగ్గాడే చిన్ని నాయన, శర్వానంద్ హీరోగా ఎక్స్ ప్రెస్ రాజా, బాలకృష్ణ హీరోగా నటించిన డిక్టేటర్ సినిమాలు రిలీజ్ కాగా అందులో ఎన్టీఆర్ సినిమా అలానే నాగార్జున సోగ్గాడే చిన్నినాయన 2 విన్నర్ గా నిలిచాయి.

2017 : ఈ ఏడాది చిరంజీవి హీరోగా తెరకెక్కిన ఖైదీ నెంబర్150, బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన గౌతమీపుత్ర శాతకర్ణి, శర్వానంద్ హీరోగా తెరకెక్కిన శతమానం భవతి, ఆర్.నారాయణమూర్తి హీరోగా తెరకెక్కిన హెడ్ కానిస్టేబుల్ వెంకట్రామయ్య సినిమాలు రిలీజ్ కాగా అందులో ఖైదీనెంబర్150 విన్నర్ గా నిలిచింది.

2018  : ఈ ఏడాది బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన జై సింహ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన అజ్ఞాతవాసి రాజ్ తరుణ్ హీరోగా తెరకెక్కిన రంగులరాట్నం సినిమా రిలీజ్ కాగా జై సింహ సినిమా విన్నర్ గా నిలిచింది.

2019 : ఈ ఏడాది వెంకటేష్, వరుణ్తేజ్ హీరోగా తెరకెక్కిన ఎఫ్2 సినిమా బాలకృష్ణ ప్రధాన పాత్రలో కథానాయకుడు, రామ్ చరణ్ హీరోగా వినయ విధేయ రామ సినిమా రిలీజ్ కాగా అందులో ఎఫ్2 సినిమా సంక్రాంతి విన్నర్ గా నిలిచింది.

2020 : ఈ ఏడాది అల్లు అర్జున్ హీరోగా నటించిన అల వైకుంఠపురంలో, మహేష్ బాబు హీరోగా నటించిన సరిలేరు నీకెవ్వరు, కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన ఎంత మంచి వాడవురా సినిమాలు రిలీజ్ కాగా అందులో అలవైకుంఠపురంలో విన్నర్ గా నిలిచింది.

2021 : ఈ ఏడాది రవితేజ హీరోగా నటించిన క్రాక్, రామ్ హీరోగా నటించిన రెడ్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నటించిన అల్లుడు అదుర్స్ సినిమాలు రిలీజ్ కాగా రవితేజ సినిమా విన్నర్ గా నిలిచింది.

మరింత సమాచారం తెలుసుకోండి: