రేపటి రోజున టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్న వరుణ్ తేజ్ ‘ముకుంద’ సినిమాకు కౌంట్ డౌన్ మొదలైంది. పైకి గంభీరత ప్రదర్శిస్తున్నా మెగా కాంపౌండ్ లో ముఖ్యంగా నాగబాబు మనస్సులో వరుణ్ తేజ్ ‘ముకుంద’ సినిమా రిజల్ట్ ఎలా ఉంటుంది అన్న టెన్షన్ బాగా పెరిగి పోతోంది అనే వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా మెగాస్టార్ ఫ్యామిలీ హీరోలకు ఉన్న బలం అంతా వారి అభిమానులే.  మెగా కుటుంబం నుంచి వచ్చే ప్రతి హీరో తొలి సినిమా మొదటి రోజు హంగామా చాల ఘనంగా అందరి దృష్టి ఆకర్షించేలా ఉంటుంది. అందుకే మెగా కుటుంబం నుండి హీరో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నప్పుడల్లా మెగా అభిమానుల సమావేశాలు పెడుతూ ఉంటారు. ఆ సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ నిన్న కూడా మెగా అభిమానుల సమావేశం హైదరాబాద్ లో జరిగింది అని టాక్. సామాన్యంగా ఇటువంటి సమావేశాలను గతంలో నాగబాబు ప్రతి మెగా హీరో కోసం నిర్వహిస్తూ వచ్చాడు. నిన్న కూడా అదేవిధానం కొనసాగిందని వార్తలు ఉన్నాయి.  తన కుమారుడు వరుణ్ తేజ్ హీరో కాబట్టి నాగబాబు శక్తి మేరకు మెగా అభిమాన సంఘాల నాయకులందరిని నిన్న ఒక చోటకు చేర్చి వరుణ్ తేజ్ ‘ముకుంద’ విజయానికి సహాయం అందించవలసిందిగా కోరాడని టాక్. మెగా అభిమానులు కూడా నాగబాబు కోరిక పై సానుకూలంగా స్పందించారని తెలుస్తోంది. అయితే ఈ సమావేశానికి చివరిదాకా చిరంజీవి వస్తాడని ఎదురు చూసిన మెగా అభిమానులకు చిరంజీవి రాకపోవడంతో కొంత నిరాశ పడ్డారని వార్తలు వస్తున్నాయి.  అయితే గతంలో అల్లుశిరీష్ ను మొదటి సినిమా ‘గౌరవం’ సినిమా విడుదల ముందు కూడా ఇటువంటి మెగా అభిమానుల సమావేశాన్ని ఆ సినిమా విడుదలకు ముందు ఏర్పాటు చేసినా ఆ సినిమా విడుదల రోజు మాత్రం ధియేటర్ల వద్ద మెగా అభిమానుల హడావిడి పెద్దగా కనిపించలేదు అనే వార్తలున్నాయి. దీనిని బట్టి నాగబాబు ఇచ్చిన ఉత్సాహంతో రేపు ‘ముకుంద’ ధియేటర్ల వద్ద మెగా అభిమానుల హడావిడి ఏ రేంజ్ లో ఉండబోతోంది అన్న ఆత్రుత ఫిలింనగర్ లో వినపడుతోంది..

మరింత సమాచారం తెలుసుకోండి: