
ప్రతిరోజు అనేక సినిమాలకు సంబంధించిన ఫస్ట్ లుక్స్ టీజర్ లు విడుదల అవుతూ ఉంటాయి. ఎంతో ప్రత్యేకమైన విషయం ఉంటే తప్ప ఇండస్ట్రీ వర్గాలు వాటి గురించి ప్రత్యేకంగా పట్టించుకోవు. అయితే ‘నాట్యం’ ఫస్ట్ లుక్ మాత్రం ఇండస్ట్రీ వర్గాలకు మాత్రమే కాకుండా మీడియా వర్గాలకు కూడ హాట్ న్యూస్ గా మారింది.
మెగా ఫ్యామిలీ కోడలు ఉపాసన విడుదల చేసిన ‘నాట్యం’ ఫస్ట్ లుక్ ను మొదట్లో ఎవరు పెద్దగా పట్టించుకోలేదు. అయితే ఆ మూవీలో కీలక పాత్రలో నటిస్తున్న వ్యక్తి గురించి తెలిసిన తరువాత అందరు షాక్ అయ్యారు. ఆమె పేరు సంధ్య రాజు ఆమె సత్యం రామలింగ రాజు కోడలు రామలింగ రాజు కొడుకు రామ రాజు భార్య. ఈమె శాస్త్రీయ సంగీత నృత్య కళాకారిణి. అనేక శాస్త్రీయ నృత్య ప్రదర్శనలు ఈమె ఇచ్చింది.
సంధ్య రాజు సోషల్ మీడియాలో కూడ చాల యాక్టివ్ గా ఉంటుంది. ట్విట్టర్ ఫేస్ బుక్ ఇన్ స్టాల్లో ఇలా అన్నిటిలోనూ ఆమె యాక్టివ్ గా ఉంటారు. సినిమాల పై ఉన్న మక్కువతో ఇప్పటికే ఆమె ఒక మళయాళ సినిమాలో కూడ నటించింది. సమంత నటించిన ‘యుటర్న్’ సినిమా ఆధారంగా మళయాళంలో నిర్మించిన ‘కేర్ ఫుల్’ మూవీలో సంధ్యరాజు నటించారు. ‘నాట్యం’ ఆమె రెండవ సినిమా. ‘నాట్యం’ నేపధ్యం లో రూపొందుతున్న ఈమూవీ కథ చాల డిఫరెంట్ అని తెలుస్తోంది. ఇలాంటి నాట్యమే ప్రధానంగా ఉండే సినిమాలకు సగటు ప్రేక్షకుల ఆదరణ ఎలా ఉంటుందో తెలియకపోయినా ఈమూవీ విజయం సాధిస్తే మళ్ళీ నాట్య ప్రధానమైన సినిమాలు వచ్చే ఆస్కారం ఉంది..