నాగార్జున లేటెస్ట్ మూవీ ‘వైల్డ్ డాగ్’ రిలీజ్ కు రెడీగా ఉంది. వాస్తవానికి ఈమూవీ సమ్మర్ రేస్ లో రావలసి ఉంది. అయితే టాప్ హీరోల సినిమాలు అన్నీ సమ్మర్ రేస్ లోకి ఎంటర్ అవుతున్న పరిస్థితులలో ‘వైల్డ్ డాగ్’ మూవీ సరైన డేట్ కోసం ఎదురు చూస్తోంది. ఇప్పుడు నాగ్ ఖాళీగా ఉండటంతో తన తదుపరి సినిమాల గురించి ఆలోచనలు చేస్తున్నాడు.


వాస్తవానికి దర్శకుడు ప్రవీణ్ సత్తార్ తో నాగ్ ఒక మూవీ చేయవలసి ఉంది. అయితే ఆ మూవీ కథ విషయంలో చిన్న తేడాలు రావడంతో నాగ్ ఆ మూవీ ప్రాజెక్ట్ ను హోల్డ్ లో పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి. దీనితో నాగార్జున దృష్టి మళ్ళీ ‘సోగ్గాడే చిన్ని నాయన’ సీక్వెల్ ‘బంగారు రాజు’ వైపు వెళ్ళినట్లు తెలుస్తోంది.


ఈమూవీకి ఇప్పటికే కథ ఫైనల్ అయిన పరిస్థితులలో ఈమూవీ షూటింగ్ ను వెంటనే మొదలు పెట్టడానికి నాగచైతన్య అడ్డంకిగా మారినట్లు మాటలు వినిపిస్తున్నాయి. దీనికి కారణం ‘బంగారు రాజు’ మూవీలో నాగచైతన్య కు కీలక పాత్ర క్రియేట్ చేసారు. అయితే ఇప్పుడు చైతూ చాల బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం అతడు విక్రమ్ కుమార్ ‘థాంక్యూ’ మూవీతో పాటు ఇంద్రగంటి మోహన్ కృష్ణ చెప్పిన కథకు సంబంధించి మూవీని కూడ ఒకే చేసాడు.


ఈ రెండు మూవీలు తరువాత వెంకీ అట్లూరితో మరో ప్రాజెక్ట్ ఉంది. దీనితో చైతన్య నాగార్జునకు అందుబాటులోకి రావాలి అంటే ఈ సంవత్సరం కుదరదు అని అంటున్నారు. దీనితో ‘బంగారు ర్రాజు’ కు సంబంధించి నాగచైతన్య గురించి ఎదురు చూడకుండా రామ్ ను ఈమూవీ ప్రాజెక్ట్ లో కలుపుకుని మల్టీ స్టారర్ గా చేస్తే మంచి మార్కెట్ వస్తుంది కదా అని నాగ్ ఆలోచన అని తెలుస్తోంది. ఒకవేళ ఈ ప్రాజెక్ట్ కు రామ్ ఆసక్తికనపరచకపోతే నాగశౌర్య వైపు అడుగులు వేయాలని నాగార్జున ఆలోచన అని అంటున్నారు..    

మరింత సమాచారం తెలుసుకోండి: