ఇండియాహెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి.ఈ కరోనా వైరస్ ప్రభావం వల్ల సినిమా థియేటర్ లు మూతపడిన సంగతి తెలిసిందే. ఇక జనాలకి టైం పాస్ అవ్వక మొబైల్ ఫోన్లకి అతుక్కుపోయారు. ఇక లాక్‌డౌన్ టైమ్‌లో తెలుగు ప్రేక్షకులు ఓటీటీల్లో సినిమాలు చూడడానికి చాలా అలవాటు పడ్డారు. ఆ క్రమంలోనే ఓటీటిలో చాలా సినిమాలు చూసేశారు. అందులో తెలుగు సినిమాల కన్నా, ఇతర భాషల సినిమాలు ఎక్కువ అని సినీ వర్గాల నుంచి అంచనా వెయ్యడం జరిగింది. అలా చూసిన సినిమాల్లో 'దియా' సినిమా కూడా ఒకటనే చెప్పాలి.
కన్నడలో వచ్చిన ఈ ప్రేమకథ గురించి ప్రేమికుల రోజున ఓ తీపికబురు రావడం జరిగింది. ఇక తెలుగు స్టార్ హీరోయిన్ అయినా సమంత ఈ సినిమా చేయడానికి ఓకే చెప్పేసిందా అని చాలా మంది భావించారు. ఇలా అనుకునేవాళ్లకు అది చేదు వార్త గానే మిగిలింది..కాని ఆ సినిమాను తెలుగులో చూద్దాం అనుకునేవాళ్లకు మాత్రం గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఈ సినిమాను తెలుగులో విడుదల చేయడానికి నిర్మాతలు సిద్ధమయ్యారట. ఓటీటీల్లో అనుకునేవారు… థియేటర్లలోనట. అవును 'దియా' త్వరలో తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లలో సందడి చేయబోతోంది.
ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన అనువాద కార్యక్రమాలు చివరిదశకొచ్చాయట. త్వరలోనే సినిమా ప్రచార కార్యక్రమాలు మొదలుపెడతారని తెలుస్తోంది. లాక్ డౌన్ కి ముందు అంటే గతేడాది ఫిబ్రవరి 7న విడుదలై బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. కె.ఎస్.ఎస్ అశోక దర్శకత్వం వహించిన ఈ ముక్కోణపు ప్రేమ కథలో ఖుషీ రవి, పృథ్వీ అంబర్, దీక్షిత్ శెట్టి అద్భుతంగా నటించారు.
ఈ సినిమాను ఓటీటీలో తెలుగు ప్రేక్షకులకు అందించడానికి తెలుగు నిర్మాతలు ప్లాన్ చేశారు. దాని కోసం డబ్బింగ్ పనులు పూర్తి చేశారు. అయితే అవుట్ పుట్ నచ్చి ఇప్పుడు ఏకంగా థియేటర్లలోనే తీసుకురావాలని చూస్తున్నారట. ఓటీటీ రిలీజ్ కంటే థియేటర్ రిలీజ్ చేస్తే బాగుంటుందనే ఫీడ్ బ్యాక్ రావడంతో ఈ దిశగా ఆలోచిస్తున్నారట. త్వరలో మిగిలిన పనులు పూర్తి చేసుకొని రిలీజ్ డేట్ ప్రకటిస్తారని భోగట్టా.ఇక ఇలాంటి మరెన్నో మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి