సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టి, చాలామంది హీరోయిన్లు వారి నటన తో, అందంతో, ఆహార్యంతో ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేస్తుంటారు. ఇలా వీరి నటనే ప్రేక్షకులను మరింత మెప్పించేలా చేస్తుంది. ఫిల్మ్ ఇండస్ట్రీలోని హీరోయిన్ లు చేతిలో సినిమాలు ఉన్నంతవరకే వారి కెరియర్ ని చక్క పెట్టుకోడానికి చూస్తుంటారు.  వచ్చిన ప్రతి అవకాశాన్ని వదులుకోకుండా, సినిమాలు చేసుకుంటూ,  తమకంటూ ఒక మంచి గుర్తింపుని తెచ్చుకుంటారు. ఇక అలాగే పెళ్ళి విషయంలోనూ వారికి నచ్చిందే చేస్తుంటారు. కొంతమంది సినీ ఇండస్ట్రీలోని వాళ్లను ప్రేమించి పెళ్లి చేసుకుంటే, మరి కొంతమంది పెద్దలు నిర్ణయించిన పెళ్లి చేసుకుంటారు. కానీ మరికొంతమంది హీరోయిన్లు ఏకంగా విదేశీయులను కూడా పెళ్లి చేసుకున్నారు. అయితే వారు ఎవరెవరు..విదేశీయులను పెళ్లి చేసుకున్నారో..? ఇప్పుడు తెలుసుకుందాం..


ఇలియాన :
దేవదాసు చిత్రం ద్వారా  తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయమైన ఇలియాన, మొదటి సినిమాతోనే బ్లాక్ బాస్టర్ ను కైవసం చేసుకుంది. ఆ తరువాత కిక్, పోకిరి వంటి బ్లాక్ బాస్టర్ సినిమాలలో నటించి, ఒక మంచి గుర్తింపును తెచ్చుకుంది. ఆ తర్వాత సినిమా అవకాశాలు నెమ్మది నెమ్మదిగా తగ్గిపోవడంతో ఆస్ట్రేలియాకు చెందిన ఆండ్రూ నీబోస్ అనే ఫోటోగ్రాఫర్ ను ప్రేమించింది. అయితే ఆ తర్వాత ఈమె అతన్ని పెళ్లి చేసుకుందని వార్తలు వచ్చినప్పటికీ, అది నిజం కాదని  ఆమె కొట్టిపారేసింది..

రిచా గంగోపాధ్యాయ :
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో లీడర్ సినిమా ద్వారా తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయమైన ఈ బ్యూటీ, ప్రభాస్ సినిమాలో మిర్చి తో అలరించింది. ఆ తర్వాత ఈ అమ్మాయి కు అవకాశాలు తగ్గిపోవడంతో తన చిన్నప్పటి ఫ్రెండ్ అయిన జోయ్ లాంగ్  తో ప్రేమలో పడి, ఆ తర్వాత ఆయనను పెళ్లి చేసుకుని అమెరికాలో స్థిరపడింది.


 శ్రేయ:
ఇప్పటికీ టాప్ మోస్ట్ హీరోయిన్లలో ఒకరిగా కొనసాగుతున్న శ్రేయ, "ఇష్టం"  సినిమా ద్వారా సినీ ప్రేక్షకులకు పరిచయం అయింది. ఆ తరువాత  అందరి అగ్ర హీరోల సరసన నటించి, తనకంటూ ఒక మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈమె రష్యాకు చెందిన ఆండ్రీ కొచ్చవ్వు అనే వ్యక్తితో ప్రేమలో పడి, ఆ తర్వాత పెళ్లి చేసుకుంది. ఆయన టెన్నిస్ క్రీడాకారుడు కూడా . ప్రస్తుతం వీరిద్దరూ రష్యా లోనే ఉన్నారు. కానీ సినిమాల్లో నటించాలని అనుకున్నప్పుడు మాత్రం ఇండియాకు వస్తున్నారు.

ప్రియాంక చోప్రా :
బాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా కొనసాగుతున్న ప్రియాంక చోప్రా హాలీవుడ్ సినిమాల్లో కూడా నటించింది. అమెరికాకు చెందిన పాప్ సింగర్ అలాగే నటుడైన నికోలస్ జన్నీ జోనస్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది..


ప్రీతి జింటా :
తెలుగుతో పాటు హిందీలో కూడా సూపర్ టాప్ హీరోయిన్  గా పేరు తెచ్చుకున్న ప్రీతిజింటా,  అమెరికా లోని లాస్ ఏంజిల్స్ కు చెందిన జెనే గుడ్ ఎనఫ్ అనే పారిశ్రామికవేత్తను పెళ్లి చేసుకుంది..

మరింత సమాచారం తెలుసుకోండి: