ఉప్పెన సినిమా ప్రభంజనం ఇంకా తగ్గలేదు.. సూపర్ హిట్ టాక్ తెచ్చుకునే సరికి సినిమా కు ఫామిలీ ఆడియెన్స్ కూడా రావడం మొదలుపెట్టారు..వైష్ణవ్ నటిస్తున్న మొదటి సినిమా కావడంతో సినిమా పై మంచి అంచనాలు నెలకొన్నాయి.. ప్రేక్షకులు, మెగా అభిమానులు ఏ అంచనాలను అయితే పెట్టుకున్నాడో ఆ అంచనాలను అయితే వైష్ణవ్ అందుకున్నాడు. తన యాక్టింగ్ తో అందరిని మెస్మరైజ్ చేశాడు.ఈ సినిమా తో కృతి శెట్టి టాలీవుడ్ లో హీరోయిన్ గా పరిచయమవుతున్నారు. సినిమాలు కూడా ఏవీ లేకపోయే సరికి ఉప్పెన సినిమాకే మొదటి ప్రాధాన్యం ఇస్తున్నారు. తొలివారం సక్సెస్ ఫుల్ గా హౌస్ ఫుల్ గా నిండిన థియేటర్లు రెండో, మూడో వారం కూడా అదే రేంజ్ మెయింటన్ చేసింది.

నాలుగో వారం కొన్ని వేరే సినిమాలు రిలీజ్ అయినా వాటి ప్రభావం ఏమాత్రం ఉప్పెన పై పడలేదు.. ఇప్పటికీ ఈసినిమా హౌస్ ఫుల్ కలెక్షన్లు సాధిస్తూనే ఉంది..ఇకపోతే ఉప్పెన సినిమా విడుద‌లకు ముందు నుంచి విడుద‌ల అయిన త‌ర్వాత కృతి శెట్టి గురించి విప‌రీత‌మైన చ‌ర్చ జ‌రుగుతోంది. చూడ్డానికి ఎంతో చిన్న పిల్లలా క‌నిపించే ఈ అమ్మ‌డు గురించి సోష‌ల్ మీడియాలో ఎక్కువ మంది చ‌ర్చిస్తున్నార‌ట. ఈ చిత్రంలో ఈమె పాత్రకి డబ్బింగ్ కూడా పర్ఫెక్ట్ గా కుదిరింది. బేబమ్మ పాత్రకి డబ్బింగ్ చెప్పిన అమ్మాయి ఎవరో తెలుసా? ఆర్జే శ్వేత.

గతంలో ఈమె సుమంత్ నటించిన ‘మళ్ళీరావా’ సినిమాలో హీరోయిన్ ఆకాంక్ష సింగ్ పాత్రకి డబ్బింగ్ చెప్పింది. అటు తరువాత మహేష్ బాబు- కొరటాల శివ కాంబినేషన్లో వచ్చిన బ్లాక్ బస్టర్ ‘భరత్ అనే నేను’ సినిమాలో హీరోయిన్ కియారా అద్వానీ పాత్రకు కూడా డబ్బింగ్ చెప్పింది.అంతేకాదు ‘హలో’ ‘రణరంగం’ చిత్రాల్లో కళ్యాణి ప్రియదర్శిని పాత్రకు అలాగే ‘చిత్రలహరి’ లో నివేదా పేతురాజ్ పాత్రకి కూడా డబ్బింగ్ చెప్పింది. నాని నటించిన ‘ఎం.సి.ఎ’ చిత్రంలోని ఇట్స్ ఎ ఫ్యామిలీ పార్టీ అనే పాటలో కూడా ఈమె కనిపిస్తుంది.ఈమె చేతిలో ప్రస్తుతం చాలా ఆఫర్లు ఉన్నాయట. తమిళ సినిమాల్లో హీరోయిన్లకు కూడా డబ్బింగ్ చెప్పే అవకాశం ఈమెను వెతుక్కుంటూ వచ్చినట్టు తాజా సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: