మెగా బ్రదర్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ అటు రాజకీయాల్లోనూ, ఇటు సినిమాల్లోనూ తన దూకుడును ప్రదర్శిస్తున్నారు. రాజకీయంగా ప్రజలకు చేరువ అవుతూనే, వరుస సినిమాలతో సినీ ప్రేక్షకులను , తన అభిమానులను అలరించడానికి సిద్ధమవుతున్నాడు.ప్రస్తుతం పవన్ కళ్యాణ్  "వకీల్‌సాబ్‌" మూవీ ఏప్రిల్‌ 9న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం అందరికి తెలిసిందే. అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన తమ్ముడు, సుస్వాగతం, బద్రి, తొలిప్రేమ, ఖుషి ,అత్తారింటికి దారేది వంటి సినిమాలు ఎంతటి ప్రభంజనం సృష్టించాయి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఏ సినిమా అయినా ఒక ట్రెండ్ ను సృష్టించిన సినిమాలే అని చెప్పవచ్చు. అందుకే యువతలో ఆయనంటే పిచ్చ క్రేజ్.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేసింది కొన్ని సినిమాలే అయినప్పటికీ అనతికాలంలోనే తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకొని అగ్ర కథానాయకుడు గా కొనసాగుతున్నాడు. అయితే పవన్ కళ్యాణ్ నటించడానికి కమిట్ అయి కొన్ని కారణాల వల్ల వదులుకున్న మూవీలు కూడా బ్లాక్ బాస్టర్ హిట్ గా నిలిచాయి ఆ మూవీలో ఏంటో ఇప్పుడు చూద్దాం

తరుణ్ హీరోగా పరిచయమైన  "నువ్వే కావాలి" మూవీ ఎంతటి ఘన విజయం సాధించిందో మనందరికీ తెలిసిందే.ఈ మూవీ మొదట "చెప్పాలని ఉంది" అనే పేరు తో పవన్ కళ్యాణ్ మరియు అమీషా పటేల్ హీరోహీరోయిన్లు గా 20 శాతం షూటింగ్ కూడా పూర్తి అయ్యింది.ఈ సినిమాని శ్రీ సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఏ ఏం రత్నం ప్రతిష్టాత్మకంగా ప్రారంబించాడు. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ మూవీ మధ్యలోనే ఆగిపోయింది. ఈ మూవీ ద్వారా తరుణ్ కు మంచి గుర్తింపు తెచ్చి హిట్ మూవీగా నిలిచింది. అదే పవన్ కళ్యాణ్ ఈ మూవీని పూర్తి చేసి ఉంటే బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తు, రికార్డుల మోత మోగించేది.
క్రియేటివ్ డైరెక్టర్ సింగీతం శ్రీనివాస రావు దర్శకత్వం లో
పవన్ కళ్యాణ్ జీసస్ క్రిస్ట్ పాత్ర లో నటించాడు. ఈ మూవీ కూడా షూటింగ్ ప్రారంభించి మధ్యలోనే ఆగిపోయింది.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దర్శకత్వం లో "సత్యాగ్రహి" అనే సినిమాని ప్రారంబించాడు, ఈ సినిమాకి నిర్మాత అల్లు అరవింద్ గారు భారీ బడ్జెట్ పెట్టి నిర్మించాలనుకున్నారు. అయితే ఈ మూవీ కూడా అనుకోని కారణాలవల్ల మధ్యలోనే ఆగిపోయింది

మరింత సమాచారం తెలుసుకోండి: