అనుష్క ప్రధాన పాత్రలో రూపొందుతున్న చిత్రం 'రుద్రమదేవి'. ఇందులో రానా ముఖ్య పాత్రధారి. గుణశేఖర్‌ స్వీయ దర్శకత్వంలో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్ ఇప్పుడు బయటకు వచ్చింది. ఫిల్మ్ ఇండస్ట్రీలోని పలువురిని రుద్రమదేవి ట్రైలర్ అలరించింది. అంతే కాకుండా గుణశేఖర్ ఉపయోగించిన టెక్నాలజీ సైతం, ఫిల్మ్ సెలబ్రీటలను ఆకట్టుకుంది. ఈ మూవీలో అల్లు అర్జున్ ..గోన గన్నారెడ్డిగా కనిపించటంతో అంచనాలు పెరిగాయి.

ఇక ట్రైలర్ విషయానికి వస్తే సాధారణ సినీ ప్రేక్షకుడు ఏమనుకుంటున్నాడో.. వంటి విషయాలపై ఇక్కడ మాట్లాడుకుందాం. ఇక దేశంలో తొలిసారిగా స్టీరియోస్కోపిక్‌ త్రీడీ విధానంలో చిత్రాన్ని తెరకెక్కించడంతో, తెలుగు ప్రేక్షకులు ఈ మూవీలోని కొన్ని సీన్స్ ని ఒరిజినాలిటితో చూసే ఫీల్ ని మిస్ అయినట్టుగా అనిపిస్తుంది. అంతే కాకుండా సీన్స్ చాలా వటికి సహజత్వానికి దూరంగా ఉన్నట్టు ఉన్నాయి.

దీంతో ఈ మూవీపై ప్రతి సిని ప్రేక్షకుడు ఇదేదో గ్రాఫికల్ మూవీ అనుకుకే భావన కలగుతుందని ఫిల్మ్ నగర్ లో ఓపెన్ టాక్ గా వినిపిస్తుంది. అయితే ట్రైలర్ లో వినిపించే రీ-రికార్టింగ్ తప్పితే, సీన్స్ లోనూ, మేకింగ్ లోనూ అంతగా పట్టు లేదనే వార్తలు కూడ క్లియర్ గా తెలుస్తుంది. ట్రైలర్ లో వచ్చే యుద్ద సన్నివేశాలను గ్రాఫిక్స్ లో సరిగా చూపించలేకపోయినట్టుగా క్లియర్ గా తెలుస్తుంది. మొత్తంగా రుద్రమదేవి అనే సబ్జెక్ట్ తెలుగు వారందరికి తెలుసు కాబట్టి, ఈ చిత్రం రిలీజ్ అనంతరం ఎటువంటి రిజల్ట్ ని అందుకుంటునేది అందరిలోనూ ఉత్కంఠగానే ఉంది.

ఈ చిత్రంను ఏప్రియల్ 24న విడుదల చేయటానికి నిర్ణయించినట్లు విశ్వసనీయ సమాచారం. ఈ మేరకు డిస్ట్రిబ్యూటర్స్ కు చెప్పినట్లు తెలుస్తోంది. తెలుగు,తమిళ,మళయాళ వెర్షన్ లు సైతం ఇదే రోజున విడుదల చేస్తారు. దాదాపు 45 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాని తెరకెక్కించినట్టు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: