నాగార్జున నట వారసత్వాన్ని కొనసాగిస్తూ నాగచైతన్య టాలీవుడ్  ఎంట్రీ ఇచ్చి సంవత్సరాలు గడిచిపోతున్నా టాప్ యంగ్ హీరోల రేసులో ఇంకా చాల వెనకపడే  ఉన్నాడు. చైతన్యను టాప్ యంగ్ హీరోల లిస్టులో చేర్చగలిగిన ఒక్క భారీ హిట్ ఇన్ని సంవత్సరాల కాలంలో చైతూను పలకరించలేదు. అక్కినేని వంశ వారసుడిగా వచ్చిన ఇమేజ్ తప్ప చైతన్యకు ప్రత్యేకంగా ఏర్పడిన ఒక స్పెషల్ ఇమేజ్ లేదు. దీనితో రకరకాల ప్రయోగాలు చేస్తూ చైతూ తెలుగు ప్రేక్షకులకు దగ్గర అవ్వడానికి తన ప్రయత్నం తాను చేస్తున్నాడు. 

ఈవారం విడుదల కాబోతున్న  ‘దోచేయ్’ సినిమా  పై చైతన్యకు భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా ప్రమోషన్  నిమిత్తం  ఈమధ్య ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో నాగచైతన్య తన సోదరుడు అఖిల్ తన తండ్రి నాగార్జునుల పై చేసిన కామెంట్స్ అందర్నీ ఆశ్చర్య పరిచాయి. టాలీవుడ్ యంగ్ హీరోల మధ్య  ప్రస్తుతం నడుస్తున్న విపరీతమైన పోటీ గురించి మాట్లాడుతూ తాను ఏ యంగ్ హీరోకు పోటీ కాదని అదేవిధంగా ఏ యంగ్ హీరో గురించి కూడా తాను భయపడను అని కామెంట్స్ చేసాడు. 

అయితే అదృష్టమో దురదృష్టమో తనకు  తెలియక పోయినా తన తమ్ముడు అఖిల్ తండ్రి నాగార్జునల మధ్య తాను ఇరుక్కు పోయానని షాకింగ్ కామెంట్స్ చేసాడు చైతూ. అంతేకాదు తనకు పోటీ  అంతా తన  ఇంటి హీరోల నుండే వస్తోంది అంటూ సెటైర్లు వేసాడు చైతూ. చైతూ చేసిన కామెంట్స్ వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా  చైతన్య చేసిన వ్యాఖ్యలలో బయట పడని  భావన దాగి ఉంది. అఖిల్ మొట్టమొదటి సినిమా ‘జోష్’ ఎటువంటి హడావిడి లేకుండా సాదాసీదా గా రిలీజ్ చేయడం  వల్ల చైతన్యకు సరైన గుర్తింపు మొదటి సినిమా నుంచే రాలేదు అన్న బాధ నాగార్జునకు ఉంది. ఈ విషయాన్ని నాగ్ చాల  సార్లు బహిరంగంగానే చెప్పాడు. 

అటువంటి పొరపాటు అఖిల్ విషయంలో జరగకుండా మొదటి సినిమానే అత్యంత భారీగా తీయడానికి ఏర్పాట్లు చేస్తున్నాడు నాగ్. దీనితో అఖిల్ మొదటి  సినిమా నుండే ప్రేక్షకులలో  అంచనాలు పెరిగాయి. అయితే అటువంటి  భారీ సినిమా తనకు ఇప్పటి వరకు తగలలేదు అన్న భావన చైతూ మనసులో కూడా ఉండటంతో తనకు పోటీ ఇస్తున్నది  బయట హీరోలు కాదు  ఇంటి హీరోలు మాత్రమే అని కామెంట్ చేసేలా చైతన్యను బాధ  కలిగించింది అని అనుకోవాలి..   







మరింత సమాచారం తెలుసుకోండి: