అప్పట్లో విజయశాంతి, బాలకృష్ణ జోడికి ఎంత క్రేజ్ ఉండేదంటే.. ప్రేక్షకులు కేవలం వెండి తెరపై విజయశాంతి బాలకృష్ణ రొమాన్స్ చూసేందుకే థియేటర్ల వద్ద క్యూ కట్టేవారు. బాలకృష్ణ విజయశాంతి తో కలిసి ఏకంగా 17 సినిమాల్లో నటించారు. ఒక హీరో ఒక హీరోయిన్ తో అన్ని సినిమాలు చేయడమే ఒక విశేషం అనుకుంటే అవన్నీ కూడా సూపర్ డూపర్ హిట్స్ గా మరొక విశేషంగా చెప్పుకోవచ్చు. కె. మురళీ మోహన్ కృష్ణ దర్శకత్వంలో రామానాయుడు నిర్మాణంలో 1984లో విడుదలైన కథానాయకుడు సినిమాలో మొదటిసారిగా విజయశాంతి, బాలకృష్ణ జోడి వెండితెరపై తళుక్కుమంది. అయితే వారి కాంబోలో వచ్చిన మొట్టమొదటి సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ హిట్ అయ్యింది.

వాళ్ళిద్దరి కాంబోలో పట్టాభిషేకం సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి అది కూడా సూపర్ హిట్ అయింది. ఈ సినిమాలో విజయశాంతి, బాలకృష్ణ పండించిన కెమిస్ట్రీ సినిమా మొత్తానికే హైలెట్ గా నిలిచింది. లేడీ సూపర్ స్టార్ విజయశాంతి.. బాలకృష్ణ సినిమాల్లో హద్దులు దాటి మరీ తన అందాలను ఆరబోసి టాలీవుడ్ ప్రేక్షకులకు కన్నుల విందు చేశారు.

వీళ్లిద్దరూ కలిసి రౌడీ ఇన్స్పెక్టర్ సినిమా లోని పాటల్లో అత్యంత రొమాంటిక్ గా నాట్యం చేసి ప్రేక్షకులకు చెమటలు పట్టించారు. ఈ సినిమాలోని పాటల్లో బాలకృష్ణ, విజయశాంతి మధ్య చోటుచేసుకునే కెమిస్ట్రీ కేక పుట్టించిందనే చెప్పాలి. వీరి కాంబినేషన్ లో వచ్చిన ముద్దుల మేనల్లుడు సినిమా కూడా బ్లాక్ బాస్టర్ హిట్ గా నిలిచింది. దీనికి కోడి రామకృష్ణ దర్శకత్వం వహించారు. విజయశాంతి, బాలకృష్ణ హీరో హీరోయిన్లుగా నటించిన దేశోద్దారకుడు సినిమా యావరేజ్ టాక్ తెచ్చుకుంది కానీ వీళ్లిద్దరూ కలిసి నటించిన ‘అపూర్వ సహోదరులు’, ‘భార్గవరాముడు’, 'మువ్వగోపాలుడు', 'భానుమతిగారి మొగుడు', 'భలే దొంగ’, లారీ డ్రైవర్, నిప్పురవ్వ వంటి అన్ని సినిమాలు విజయవంతమయ్యాయి. దీంతో అప్పట్లో బాలకృష్ణ, విజయశాంతి లకు హిట్ పెయిర్ గా పేరొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: