గతేడాది కరోనా ఫస్ట్ వేవ్ కష్టకాలంలో ఆపద్బాంధవుడిగా అవతారమెత్తిన
అరుంధతి ఫేమ్ సోనూ సూద్ ఈ ఏడాది సెకండ్ వేవ్ లో కూడా తన వంతు సాయం చేస్తున్నారు. ఆయన కారణంగా భారత దేశ వ్యాప్తంగా వందల మంది ప్రజలు ప్రాణాలు కాపాడ బడుతున్నాయి. సోనూ సూద్ తన పేరిట ఫౌండేషన్ ప్రారంభించి వాలంటీర్ల చేత ప్రతి ఒక్కరికి సహాయం అందేలా చర్యలు చేపడుతున్నారు.
కరోనా వైరస్ బారిన పడిన తర్వాత కూడా సోనూసూద్ తన సేవా కార్యక్రమాలను ఒక్క నిమిషం కూడా వాయిదా వేయలేదు.
ఫోన్ కాల్స్, సోషల్
మీడియా ద్వారా ప్రతి ఒక్కరికీ చేరువలో ఉంటున్నారు.
భారతదేశంలో ప్రభుత్వం కంటే వేగవంతంగా స్పందిస్తూ ప్రతి ఒక్కరి ప్రాణాలు నిలబెట్టేలా సోనూ సూద్ పౌండేషన్ కృషి చేస్తోంది. అయితే కొందరు రాజకీయ నేతలు సోనూ సూద్ మంచితనాన్ని చూసి అసూయ పడుతున్నారు అని తెలుస్తోంది. సోనూ సూద్ చాలా విషయాల్లో విఫలమవుతున్న ప్రభుత్వాల వైఫల్యాలను ఎత్తి చూపుతున్నారు. ప్రభుత్వం అకస్మాత్తుగా లాక్ డౌన్ విధించింది కానీ వలస కార్మికుల ను మాత్రం ఇంటికి చేరవేయడంలో పూర్తిగా విఫలమైంది. కానీ సోనూ సూద్ తన సొంత డబ్బులతో వలస కార్మికులందరినీ ఇంటికి పంపించారు. ప్రభుత్వాన్ని తిట్టిన నోళ్లు సోనూ ని బాగా పొగిడాయి.
భారతదేశం మొత్తంలో ఎంతో మంది ధనవంతులైన రాజకీయ నేతలు ఉన్నారు కానీ ఒక్కరు కూడా సోనూ సూద్ చేసిన సాయం లో పదవ వంతు కూడా చేయలేదు. ఐతే కొందరు రాజకీయ నేతలు తాము పవర్ లో ఉండి కూడా సోనూ సూద్ కంటే మంచి పేరు తెచ్చుకోలేక పోతున్నామని అసూయతో సోషల్
మీడియా వేదికగా సోనూ ని టార్గెట్ చేస్తున్నారు. ఇకపోతే సోనూ సూద్ వంటి గొప్ప మనసున్న వ్యక్తులు దేశానికి చాలా అవసరం. సహాయం చేయకపోయినా అలాంటి వారిని నిరుత్సాహ పరచకూడదు.