తెలుగు ప్రేక్షకులందరూ వెబ్ సిరీస్‌లు చూడడానికి బాగా ఆసక్తి చూపుతున్నారు. ఈ లాక్ డౌన్ కాలంలో వెబ్ సిరీస్ లు చూసే ప్రేక్షకుల సంఖ్య కూడా పెరిగిపోయింది. ఐతే ఈ ఆర్టికల్ లో వెబ్ సిరీస్ ప్రియుల కోసం 5 బెస్ట్ వెబ్ సిరీస్‌లను పొందుపరిచాం.


1. ప్రపంచవ్యాప్తంగా బాగా పాపులర్ అయిన మనీ హెయిస్టు సీజన్ 5 త్వరలోనే రాబోతున్నది. డబ్బుల దొంగతనం చుట్టూ తిరిగే ఈ వెబ్ సిరీస్ కథ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఇది నెట్ ఫ్లిక్స్ లో తెలుగులో కూడా అందుబాటులో ఉంది.



2. ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2 రిలీజ్ కోసం తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. బెస్ట్ ఇండియన్ వెబ్ సిరీస్ గా పేరు తెచ్చుకున్న ఫ్యామిలీ మ్యాన్ యొక్క సీజన్ 2 ఈ ఏడాది జూన్ లేదా జులై నెలలో విడుదల కానుందని సమాచారం. సీజన్ 2 లో సమంత అక్కినేని కూడా కనిపించనున్నారు.



3. రొమాంటిక్ కామెడీ డ్రామా లిటిల్ థింగ్స్ సీజన్ 1-3 నెట్ ఫ్లిక్స్ లో విడుదలై ప్రేక్షకులను బాగా అలరించాయి. సీజన్ 4 అనౌన్స్ చేశారు కానీ ఇంకా దీని రిలీజ్ కి సంబంధించి ఎటువంటి ప్రకటన చేయలేదు.



4. సైంటిఫిక్ ఫిక్షన్ థ్రిల్లర్ డ్రామా గా వచ్చిన స్ట్రెంజర్ థింగ్స్ ప్రపంచవ్యాప్తంగా భారీ హిట్ అయింది. ఈ వెబ్ సిరీస్ కి సంబంధించి మూడు సీజన్స్ విడుదలై ప్రేక్షకులని బాగా ఎంటర్టైన్ చేస్తాయి. నాలుగవ సీజన్ కి సంబంధించి ట్రైలర్ విడుదల అయింది కానీ రిలీజ్ డేట్ మాత్రం ఇంకా ప్రకటించలేదు.



5. ఢిల్లీ క్రైమ్ సీజన్ 1 మంచి రెస్పాన్స్ పొందింది. 2012లో ఢిల్లీలో జరిగిన అత్యాచార ఘటన ఆధారంగా రూపొందించిన ఈ వెబ్ సిరీస్ చాలా సహజంగా ఉంటుంది. అయితే ఈ సిరీస్ సీజన్ 2 నెట్ ఫ్లిక్స్ లో త్వరలోనే విడుదల కానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: