సూపర్ స్టార్ మహేష్ బాబు మరోసారి తాను శ్రీమంతుడుని అని నిరూపించుకున్నాడు. కొరటాల శివ దర్శకత్వంలో మహేష్ బాబు శ్రీమంతుడు సినిమా చేసిన తర్వాత ఆ సినిమాలో హీరో చేస్తున్న పనులకు ఇన్స్పైర్ అయిన ఆయన కూడా బయట రెండు గ్రామాలను దత్తత తీసుకున్నారు. అందులో ఒకటి సూపర్ స్టార్ కృష్ణ స్వగ్రామం బుర్రి పాలెం కాగా మరొకటి తెలంగాణలోని సిద్దాపురం అనే గ్రామం. తాజాగా మహేష్ బాబు ఈ రెండు గ్రామాలకు అండగా నిలబడినట్లు తెలుస్తోంది. 



ప్రభుత్వ అధికారుల మద్దతుతో ఈరెండు గ్రామాల్లో ఉన్న అర్హులైన ప్రజలందరికీ వ్యాక్సిన్ అందేలా మహేష్ బాబు చొరవ తీసుకున్నట్లు సమాచారం. నిజానికి గ్రామాలను చాలామంది వీఐపీలు దత్తత తీసుకున్నారు. కాని వాళ్ళంతా స్కూళ్లు కట్టించి లేదా రోడ్లు వేయించి తన పని అయిపోయిందని చేతులు దులిపేసుకున్నారు.. కానీ మహేష్ బాబు అలా కాకుండా గ్రామానికి సంబంధించి ప్రతి అంశంలోనూ అండగా ఉంటానని చెప్పినట్టే ప్రతీ అంశంలో అండగా నిలుస్తున్నారు. ఇక మహేష్ బాబు ఇప్పటికే తన ఫౌండేషన్ ద్వారా వేల మంది చిన్నారులకు గుండె ఆపరేషన్ కూడా చేస్తున్న సంగతి తెలిసిందే. 



ఇక మహేష్ బాబు సినిమాల విషయానికొస్తే ఆయన ప్రస్తుతం పరుశురాం దర్శకత్వంలో సర్కార్ వారి పాట అనే సినిమా చేస్తున్నాడు.. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా బ్యాంక్ ఫ్రెండ్స్ కు సంబంధించి కథతో రూపొందిస్తున్నారని తెలుస్తోంది. నిజానికి ఈ సినిమా చాలా రోజుల క్రితమే పూర్తి కావాల్సి ఉంది కానీ కరోనా కారణంగా షూటింగ్ వాయిదా పడుతూ వస్తోంది. ఈ సినిమా మొదటి షెడ్యూల్ దుబాయ్ లో పూర్తి చేసుకుని వచ్చి రెండో షెడ్యూల్ హైదరాబాద్ లో పూర్తి చేయాలని భావించారు కానీ కరోనా సెకండ్ వివో కారణంగా షూటింగులు నిలిపివేసిన పరిస్థితి.

మరింత సమాచారం తెలుసుకోండి: