బన్నీ కెరీర్‌లో వరుడు సినిమా బిగ్గెస్ట్ డిజాస్టర్ అయ్యిందని నిస్సందేహంగా చెప్పుకోవచ్చు. 2010 మార్చి 31న విడుదలైన ఫ్యామిలీ యాక్షన్ డ్రామా వరుడు లో అల్లు అర్జున్, భానుశ్రీ మెహ్రా నటించారు. భారీ అంచనాల నడుమ రిలీజైన వరుడు చిత్రం భారీ డిజాస్టర్ కాగా.. డిజాస్టర్ అవ్వడానికి కారణాలు ఏంటో ఈ ఆర్టికల్ లో వివరంగా తెలుసుకుందాం.


ఈ సినిమాలో సందీప్( అల్లు అర్జున్) తన తల్లిదండ్రులు చూసిన యువతిని పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. అయితే కేవలం పెళ్లి ముహూర్త సమయం లోనే తన కాబోయే భార్య ను చూడాలని సందీప్ నిర్ణయించుకుంటాడు. అయితే తన కాబోయే భార్య దీప్తి (భానుశ్రీ మెహ్రా) ని చూడగానే సందీప్ ప్రేమలో పడతాడు. కానీ దీప్తిని దివాకర్(ఆర్య) అనే ఒక వ్యక్తి కిడ్నాప్ చేస్తాడు. తన కాబోయే భార్య ని దివాకర్ ఎందుకు కిడ్నాప్ చేశాడు? అనే అన్వేషణలో పడి చివరికి తన కాబోయే భార్యను సందీప్ కాపాడుకుంటాడు.



పెళ్లి కొడుకుగా అల్లు అర్జున్ అద్భుతమైన నటనా చాతుర్యాన్ని కనబరిచారు. పెళ్లికూతురుగా భానుశ్రీ మెహ్రా చాలా చక్కగా కనిపించి ప్రేక్షకులను అలరించారు. అయితే ఈ సినిమా మొదటి భాగం చాలా బాగుంది కానీ సెకండాఫ్ అసలు బాగోలేదు. ఫస్ట్ హాఫ్ సినిమాలో పెళ్లి గురించి, సాంప్రదాయాల గురించి చూపించగా సెకండాఫ్ లో వెంటనే భారీ యాక్షన్ సన్నివేశాలు చూపించి ప్రేక్షకుడికి చిరాకు తెప్పించారు. సెకండాఫ్ లో విలన్ ఫ్లాష్ బ్యాక్ ప్రారంభమైన సమయం నుంచి సినిమా చాలా అనాసక్తికరంగా మారుతుంది. సినిమాలో ఐదురోజుల పెళ్లి అనే కాన్సెప్ట్ బాగుంది కానీ మిగతా సినిమా అంతా కూడా బోరింగ్ గా అనిపించింది. హీరో, విలన్ మధ్య చోటుచేసుకునే సన్నివేశాలు కూడా ఏమాత్రం ఆకట్టుకోవు. సినిమా డైరెక్టర్ గుణశేఖర్ గ్రాఫిక్స్, యాక్షన్ సన్నివేశాలపై బాగా శ్రద్ధ చూపించారు కానీ సినిమాని ఎమోషనల్ గా రూపొందించడంలో పూర్తిగా విఫలమయ్యారు. ఈ కారణాల వల్ల సినిమా డిజాస్టర్ అయ్యింది.

మరింత సమాచారం తెలుసుకోండి: