ప్రఖ్యాత దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో తొలిసారిగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలిసి నటిస్తున్న సినిమా ఆర్ఆర్ఆర్. ఈ సినిమాపై మెగా నందమూరి అభిమానులతో పాటు నార్మల్ ఆడియన్స్ లో కూడా భారీ స్థాయిలో నెలకొన్న విషయం తెలిసిందే. ఇప్పటికే చాలా వరకు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా కేవలం అతి కొద్ది పార్ట్ మాత్రమే బ్యాలెన్స్ మిగిలి ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఇటీవల కొన్నాళ్లుగా మన దేశంలో కరోనా ప్రభావం విస్తృతంగా కొనసాగుతుండటంతో మిగతా సినిమాలతో పాటు ఈ మూవీ షూటింగ్ ని కూడా నిలుపుదల చేసింది యూనిట్.

అయితే మరోవైపు ఆర్ఆర్ఆర్ సినిమాకు సంబంధించి గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్ వర్క్ మాత్రం వేగవంతంగా జరుగుతున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ సినిమాని ఈ ఏడాది అక్టోబరు 13న ఎంతో గ్రౌండ్ లెవెల్ లో విడుదల చేయనున్నారు. ఆలియాభట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్ర చేస్తుండగా ఎన్టీఆర్ కొమరం భీమ్ చేస్తున్నారు. డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య ఎంతో భారీ వ్యయంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాని రాజమౌళి మంచి యాక్షన్ తో కూడిన ఎమోషనల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్నారని తెలుస్తోంది.

ఇక ఇప్పటికే విడుదలైన ఈ సినిమా లోని హీరోలిద్దరి ఫస్ట్ లుక్ టీజర్స్, పోస్టర్ లకు అందరి నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే అసలు విషయం ఏంటంటే గత కొద్ది రోజులుగా ఎన్టీఆర్, రామ్ చరణ్ అభిమానులు ఇద్దరూ కూడా తమహీరో గొప్పంటే తమహీరో గొప్ప అంటూ సోషల్ మీడియా మాధ్యమాల్లో కొంత కోల్డ్ వార్ కొనసాగిస్తున్నారు. ఇక నిన్న ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా విడుదలైన కొమురం భీం ఫస్ట్ లుక్ పోస్టర్ కి మంచి రెస్పాన్స్ రావడంతో నందమూరి అభిమానులు ఎంతో సంతోష పడుతుండగా కొందరు చరణ్ ఫ్యాన్స్ దానిపై విమర్శలు చేస్తున్నట్లు సమాచారం.
 

దీనితో ఇద్దరు హీరోల ఫ్యాన్స్ మధ్యన కొద్దిపాటి వివాదం చెలరేగడంతో నేడు ఉదయం నుంచి అటు రామ్ చరణ్ అభిమానులు ఎన్టీఆర్ పై అలానే ఇటు ఎన్టీఆర్ అభిమానులు రామ్ చరణ్ పై నెగటివ్ ట్రెండ్స్ సృష్టిస్తూ కామెంట్స్ చేస్తున్నారు. ముఖ్యంగా ట్విట్టర్లో వీటిని మరింతగా మరింతగా కొనసాగిస్తుండడంతో ప్రస్తుతం ఈ టాపిక్ సోషల్ మీడియాలో ఎంత వైరల్ గా మారింది. అయితే ఆర్ఆర్ఆర్ సినిమాలో ఈ ఇద్దరు హీరోలు కూడా అదరగొట్టే పెరఫార్మన్స్ చేస్తున్నారని యూనిట్ ఎంతో ఆనందంగా చెపుతుంటే వారి వారి అభిమానులు మాత్రం ఒకరి పై మరొక ఈ విధంగా నెగటివ్ ట్రెండ్స్ తో విమర్శలు చేసుకోవడం సరైనది కాదని అంటున్నారు పలువురు సినీ విశ్లేషకులు.... !!



మరింత సమాచారం తెలుసుకోండి: