
ఇక మెగాస్టార్ పెద్ద సోదరుడు నాగబాబు పలు సినిమాల్లో సహహానటుడిగా అలానే అక్కడక్కడా కొన్ని సినిమాల్లో హీరోగా నటించడం జరిగింది. ఇక టాలీవుడ్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పేరు దక్కించుకున్న నాగబాబు ప్రస్తుతం కూడా అటువంటి పాత్రలనే చేస్తున్నారు. అయితే మెగాస్టార్ రెండవ సోదరుడు పవన్ కళ్యాణ్, అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చి ఆ తరువాత తొలిప్రేమ, బద్రి, ఖుషి వంటి బ్లాక్ బస్టర్ మూవీస్ తో యువతలో మంచి క్రేజ్ పొందారు. ఆపై ఎన్నో సక్సెస్ లు, పాపులారిటీ సొంతం చేసుకున్న పవన్ ప్రస్తుతం టాలీవుడ్ నెంబర్ వన్ హీరోల్లో ఒకరిగా కొనసాగుతున్నారు.
ఇక మొదటి నుండి కూడా మెగాబ్రదర్స్ ముగ్గురికి ఒకరిపై మరొకరికి మంచి ప్రేమానుబంధం ఉంది. తన రెండు కళ్ళు తన సోదరులే అని, వారి కోసం నేను ఎంతకష్టం అయినా భరించడానికి సిద్ధం అని పలు సందర్భాల్లో చిరంజీవి చెప్పడం జరిగింది. ఇక నాగబాబు, పవన్ కూడా అన్నయ్య చిరంజీవి తమ కోసం జీవితంలో ఎన్నో కష్ట నష్టాలు ఎదుర్కొని తమని ఈ స్థాయికి తీసుకువచ్చారని, అమ్మ నాన్నలతో సమానంగా అన్నయ్య అంటే కూడా మాకు అమితమైన ప్రేమ అని వారు కూడా చెప్తూ ఉంటారు. ఇక అసలు విషయం ఏమిటంటే నేడు ప్రపంచ సోదరుల దినోత్సవం కావడంతో చిన్నప్పుడు తమ అన్నదమ్ములు ముగ్గురూ కలిసి దిగిన ఒక ఫోటోని తన సోషల్ మీడియా అకౌంట్స్ లో షేర్ చేసిన చిరంజీవి, నా బ్లడ్ బ్రదర్స్ ని ఎప్పటికీ మరిచిపోలేను అంటూ ఎమోషనల్ గా పెట్టిన పోస్ట్ పెట్టారు. కాగా ప్రస్తుతం ఆ పోస్ట్ సోషల్ మీడియాలో ఎంతో వైరల్ అవుతోంది ..... !!