అల్లు శిరీష్ ఇండ‌స్ట్రీకి వ‌చ్చి ఇప్ప‌టికి చాలా సంవ‌త్స‌రాల‌వుతోంది. స్టార్ హీరో అల్లు అర్జున్ త‌మ్ముడిగా, బ‌డా నిర్మాత అల్లు అర‌వింద్ కొడుకుగా ఎంట్రీ ఇచ్చాడు శిరీష్‌. అయితే అనుకున్నంత స్థాయిలో మాత్రం సినిమాలు ఆడ‌లేదు. దీంతో కొద్ది కాలం గ్యాప్ తీసుకున్నాడు. ఆ త‌ర్వాత నిర్మాత అవ‌తారం ఎత్తి సినిమాలు తీసాడు. కానీ ఇప్పుడు మ‌ళ్లీ కొత్త సినిమాతో వ‌స్తున్నాడు.


శ్రీరస్తు, శుభ‌మ‌స్తు సినిమాత త‌ర్వాత మ‌నోడికి పెద్ద హిట్ ప‌డ‌లేద‌నే చెప్పాలి. శిరీష్ ఇప్ప‌టి వ‌ర‌కు కెరీర్‌లో ఐదు సినిమాలు చేయ‌గా, వీటిలో ఏ సినిమా కూడా పెద్ద విజ‌యం సాధించ‌లేక‌పోయింది. ఇప్పుడు ఆరో సినిమాగా విజేత’ ‘జతకలిసే’ ఫేమ్ రాకేష్ శశి డైరెక్ష‌న్‌లో కొత్త క‌థ‌తో వ‌స్తున్నాడు. ప్రేమ కాదంట అనే టైటిల్‌తో కొద్ది సేప‌టి కింద‌టే ఫ‌స్ట్ లుక్ రిలీజ్ చేశాడు.


ఈ పోస్ట‌ర్‌తో త‌న కొత్త సినిమా టైటిల్‌తో పాటు మూవీ ద‌ర్శ‌కుడికి సంబంధించిన విష‌యాల‌పై శిరీష్ క్లారిటీ ఇచ్చాడు. ఈ హీరోకు జోడీగా అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. అను కూడా చాలా గ్యాప్ త‌ర్వాత టాలీవుడ్‌లోసినిమా చేస్తోంది. అయితే టైటిల్‌తోనే ఆస‌క్తి రేకెత్తించారు డైరెక్ట‌ర్‌. ఈ సినిమాకు సంబంధించిన పోస్ట‌ర్లు రెండు రోజులుగా హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి.

ఇక ఈ రోజు రెండు పోస్ట‌ర్స్ విడుదల చేయ‌గా, ఇవి రెండు కూడా ఇంట్రెస్టింగ్ గానే ఉన్నాయి. ఈ పోస్ట‌ర్‌ని బ‌ట్టి చూస్తుంటే ఈ సినిమా పక్కా రొమాంటిక్ ల‌వ్ స్టోరీ యాంగిల్‌లో న‌డుస్తోంద‌ని అర్ధ‌మ‌వుతుంది. లవ్ అండ్ రిలేషన్ షిప్ ల మధ్య సరికొత్త కోణాన్ని చూపించాల‌ని డైరెక్ట‌ర్ ప్ర‌య‌త్నిస్తున్న‌ట్టు అర్థ‌మ‌వుతోంది. ఇందులో శిరీష్ సిక్స్ ప్యాక్ తో కనిపించబోతున్నాడు. ఈరోజు అల్లు శిరీష్ బ‌ర్త్ డే కానుక‌గా విడుద‌లైన పోస్ట‌ర్ ఆక‌ట్టుకుంటుంది. మ‌రి ఈ సినిమాతో అయినా పెద్ద హిట్ అందుకోవాల‌ని శిరీష్ ప్ర‌య‌త్నిస్తున్నాడు. మ‌రి అనుకున్నట్టు సినిమా హిట్ అవుతుందో లేదో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: