ఈ చత్రపతి శివాజీ కథను రాజమౌళి తండ్రి అయిన విజయేంద్ర ప్రసాద్ రెడీ చేస్తున్నాడు అంటూ కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి.ఈ వార్తలపై స్వయంగా విజయేంద్ర ప్రసాద్ నే క్లారిటీ ఇచ్చారు.ఆయన తాజాగా అలీతో సరదాగా టాక్ షో కి వచ్చారు. ఈ క్రమంలో కొన్ని ఆసక్తికర విషయాలను ప్రేక్షకులతో పంచుకున్నారు. ఆ సందర్బంగా ఆయన మహేష్ బాబు తో సినిమా విషయమై స్పందించాడు.ఇప్పటి వరకు మహేష్ బాబుతో సినిమా కథ గురించి అసలు చర్చించలేదని, ప్రస్తుతం రాజమౌళి ద్రుష్టి అంతా "ఆర్ ఆర్ ఆర్" సినిమా పైనే ఉందని విజయేంద్ర ప్రసాద్ క్లారిటీ ఇచ్చాడు.
సూపర్ స్టార్ మహేష్ బాబు కోసం కథ తయారు చేయాలంటే కాస్త కష్టమే అంటూ విజయేంద్ర ప్రసాద్ చెప్పుకొచ్చాడు. ఆర్ ఆర్ ఆర్ సినిమా అయిపోయిన తర్వాతనే వేరే కథ విషయమై చర్చలు మొదలు పెట్టబోతున్నట్లుగా పేర్కొన్నాడు. విజయేంద్ర ప్రసాద్ గారి మాటలు వింటుంటే మహేష్ బాబుతో మూవీ విషయమై ఇప్పటి వరకు ఎటువంటి కథకు సంబందించిన చర్చలు మొదలు కాలేదని అర్ధం అవుతుంది. అసలు మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్లో సినిమా వస్తుందా అనే డౌట్ కూడా అభిమానుల్లో పెరిగిపోయింది మరి. !
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి