సురేఖా వాణికి సోషల్ మీడియాలో ఫాలోయింగ్ ఎక్కువగానే ఉంది. ఇక ఆమె భర్త మరణించిన తరువాత సురేఖా వాణి సోషల్ మీడియాకు అలవాటు పడింది. ఇక ఆమెకు సంబంధించిన డాన్స్ వీడియోలను, ఫోటోలు సోషల్ మీడియాలో ఎప్పడికప్పుడు షేర్ చేస్తుంది. ఇక సురేఖా కూతురు కూడా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. ఇక ఇద్దరు కలిసి హల్ చల్ చేస్తున్నారు. ఇక సురేఖా కూతురు సోషల్ మీడియాలో బాగా ట్రోలింగ్స్ కూడా ఎక్కువగానే ఎదుర్కొంటుంది.
ఇక అప్పట్లో సురేఖా రెండో పెళ్లి చేసుకుంటుందని వార్తలు సోషల్ మీడియాలో హల్ చల్ చేశాయి. ఈ వార్తలపై సురేఖా స్పందించి వాటికీ చెక్ పెట్టింది. ఇక ఈమధ్య సురేఖా గ్లామర్ తో మరింత రెచ్చిపోతుందని చెప్పవచ్చు మరి. తాజాగా ఆమె తన సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ షేర్ చేసింది. ఇక ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది
సురేఖా వాణి ప్రేమకు వయసుతో పని లేదు అంటూ ఆమె వయస్సు అనేది ప్రేమలో ఒక నెంబర్ అని అంటుంది. అయితే ఈ విషయం గురించి మాట్లాడుతూ.. తక్కువ వయసున్న అబ్బాయిలను వివాహం చేసుకుంటున్న నలుగురు జంటలను ఫోటోలను షేర్ చేసింది ఈ భామ. ఆమె షేర్ చేసిన ఫొటోలో బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా నిక్ జోనస్ ఉండగా.. హాలీవుడ్ జంటల ఫోటోలు ఉన్నాయి. అయితే సురేఖా ఫోటో షేర్ చేయడం వెనుక ఏదైనా ఉందా అంటూ పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇక మరోసారి కామెంట్స్ తో ఇబ్బందులు ఎదుర్కొంటుంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి