ఆ సమాధానం ఏంటో తెలుసుకుంటే.. ఒక అభిమాని మీ ఫేవరెట్ హీరో ఎవరు అని ప్రశ్నించగా.. "రజనీ సార్" అని వైష్ణవ్ తేజ్ సమాధానమిచ్చారు. ఫేవరెట్ మూవీ ఏంటి అని అడగగా శివాజీ అని ఆయన వెల్లడించారు. అయితే ఫేవరెట్ హీరో ఎవరని ప్రశ్నిస్తే చిరంజీవి/ పవన్ కళ్యాణ్ పేరు చెప్తారని మెగా అభిమానులు ఊహించారు. కానీ అతను అనూహ్యంగా రజనీకాంత్ పేరు చెప్పడంతో మెగా ఫ్యాన్స్ షాక్ అయ్యారు. ఇక ఆయన నెటిజనుల అడిగిన ఇతర ప్రశ్నలకు ఏం సమాధానాలు ఇచ్చారో తెలుసుకుంటే..ప్రశ్న: మీకు బాగా ఇష్టమైన ఆహారం ఏంటి?
సమాధానం: సుషీ, టమాటో పచ్చడి అన్నం.
ప్రశ్న: మీకు ఉప్పెన సినిమాలో బాగా నచ్చిన సన్నివేశం ఏంటి?
సమాధానం: బేబమ్మ బస్సు లోపల నుంచి ఫైట్ చేస్తున్న ఆసి ని మొట్టమొదటిసారిగా చూసిన సన్నివేశం.
ప్రశ్న: కృతి శెట్టి గురించి మాకు తెలియని విషయం ఒకటి చెప్పండి.
సమాధానం: ఆమె చాలా బాగా పాడుతుంది.
ప్రశ్న: మీ ఫేవరెట్ హీరోయిన్ ఎవరు?
సమాధానం: నజ్రియా నజీమ్ ఫహద్.
ప్రశ్న: పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన సినిమాలో మీకు ఇష్టమైన సినిమాలు ఏంటి?
సమాధానం: బద్రి, ఖుషి, తమ్ముడు.
ప్రశ్న: మీకు ఇన్స్పిరేషన్ ఎవరు?
సమాధానం: పవన్ కళ్యాణ్
ప్రశ్న: మీకు ఎటువంటి సినిమాలంటే ఎక్కువగా ఇష్టం?
సమాధానం: యాక్షన్ సినిమాలు
ప్రశ్న: మీకు ఏ క్రికెటర్ అంటే బాగా ఇష్టం?
సమాధానం: మహేంద్ర సింగ్ ధోనీ.
ఇకపోతే గిరీషయ్యతో ఒక సినిమా చేస్తున్న వైష్ణవ్ తేజ్ క్రిష్ దర్శకత్వంలో కొండపొలం సినిమా షూటింగ్ పూర్తి చేశారు. అయితే షూటింగ్ మొత్తం పూర్తి చేసుకున్న ఈ సినిమా ఆహా ఓటీటీ వేదికగా విడుదల కానుందని ఇటీవల వార్తలు వచ్చాయి కానీ దానికి సంబంధించిన అధికారిక ప్రకటన విడుదల కాలేదు. ఇకపోతే వైష్ణవ్ తేజ్ ఇంకా చాలా సినిమాలు చేస్తున్నారని సమాచారం.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి