సాదారణంగా చిత్ర పరిశ్రమలో అన్నిరకాల కాన్సెప్ట్ లతో కూడిన సినిమాలు వచ్చినప్పటికీ అటు పోలీస్ స్టోరీలకు మాత్రం ఒక ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది  అయితే దర్శక నిర్మాతలు ఎప్పుడో ఒకసారి పోలీస్ స్టోరీ చేసేందుకు సిద్ధమవుతుంటారు. ఇక పోలీస్ స్టోరీ అనగానే భారీ అంచనాలు కూడా పెరిగి పోతూ ఉంటాయి. ఇలా  ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఎన్నో పోలీస్ స్టోరీ సినిమాలు కొన్ని బ్లాక్బస్టర్ విజయాలను సాధిస్తూ మరికొన్ని మాత్రం చివరికి బొక్క బోర్లా పడిపోయాయ్.  అయితే పోలీస్ స్టోరీ సినిమా అయితే ఏంటి కథ రొటీన్కు భిన్నంగా ఉండాలి అని అటు దర్శకనిర్మాతలు ప్లాన్ చేస్తుంటారు.



ఇలా తెలుగు చిత్ర పరిశ్రమలో రొటీన్కి భిన్నంగా..  ఊహించని మలుపులతో సినిమా చూస్తున్న ప్రేక్షకులందరినీ మెస్మరైజ్ చేసి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది సినిమా పోకిరి. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో సూపర్స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన ఈ సినిమా తెలుగు చిత్ర పరిశ్రమలో బాక్సాఫీస్ రికార్డులన్నింటినీ బద్దలు కొట్టింది.



 అప్పటివరకు.. పోలీస్ సినిమాలు అంటే ఇలాగే తీయాలి అని ఉన్న పంథా మార్చేసింది పోకిరి సినిమా. ఈ సినిమాలో హీరో పోలీస్ కాదు పోకిరి.  ఇక మొదటి నుంచి ఆవారాగా తిరుగుతూ.. రౌడీ లాగా బిహేవ్ చేస్తూ ఉంటాడు. ఒక నలుగురు గ్యాంగ్ ని వెంటేసుకొని పని పాట లేకుండా తిరుగుతూ ఉంటాడు.  అంతేకాదు ఇక గ్యాంగ్ స్టర్స్ తో డీలింగ్ మాట్లాడుతూ ఉంటాడు.  అయితే సినిమా మొత్తం ఇలాగే సాగి పోతుంది అని అనుకుంటారు ప్రేక్షకులు.  కానీ అప్పుడే అసలు ట్విస్ట్ ఇచ్చాడు దర్శకుడు. అప్పటివరకు ఆవారాగా రౌడీ లాగా తిరిగిన హీరో కాస్తా ఒక్కసారిగా పోలీసులాగా ఎంట్రీ ఇస్తాడు. ఈ సినిమా చూస్తున్న ప్రేక్షకులకు మహేష్ బాబు పోలీస్ ఎంట్రీ అవాక్కయ్యేలా చేస్తుంది. ఇక ఈ సినిమా ఇండస్ట్రీ రికార్డులను బద్దలు కొట్టింది.  ఇలా పోకిరోడు పోలీస్ అయ్యి అటు బాక్సాఫీస్ ని షేక్ చేసాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: