క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ - స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో ముచ్చటగా మూడో సారి రూపొందుతున్న పుష్ప సినిమా లో కథానాయిక గా లక్కీ బ్యూటీ రష్మిక మందాన నటిస్తున్న విషయం తెలిసిందే. మహేష్ బాబు హీరోగా వచ్చిన సరిలేరు నీకెవ్వరు చిత్రంలో ఓ అల్లరి పిల్ల రోల్ లో నటించిన రష్మిక పై విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. ఎటువంటి ప్రాధాన్యత లేని ఓ క్యారెక్టర్ లో నటించి తమని నిరాశపరిచారని ఆమె అభిమానులు సోషల్ మీడియా వేదికగా అప్పట్లో తీవ్ర నిరాశ వ్యక్తం చేశారు. ఐతే కనీసం పుష్ప సినిమాలోనైనా ఆమె మంచి ప్రాధాన్యత గల పాత్రలో నటిస్తారా? లేక ఏ ఐడెంటిఫికేషన్ లేని పాత్రలో నటించి మమ అనిపించేస్తారా? అనే సందేహాలతో అభిమానులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.
అయితే ఆమె పాత్రకు సంబంధించి ఇప్పటి వరకు ఎన్నో వార్తలు వచ్చాయి. ఆమె పుష్ప సినిమాలో ఒక పల్లెటూరి పిల్ల లాగా కనిపించబోతున్నారని.. పూర్తి డీగ్లామర్ రోల్ లో నటిస్తున్నారని ఇండస్ట్రీ నుంచి వార్తలు వచ్చాయి. కానీ అభిమానులకు మాత్రం ఎలాంటి క్లారిటీ రాలేదు. అయితే తన ఫ్యాన్స్ అందరికీ పూర్తిస్థాయిలో స్పష్టత ఇచ్చేందుకు సాక్షాత్తూ రష్మిక నే తన పాత్ర గురించి వెల్లడించారు.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ ముద్దుగుమ్మ పుష్ప సినిమాలోని తన పాత్ర అందరికీ ఆశ్చర్యం గొల్పుతుందని చెప్పుకొచ్చారు. "నా క్యారెక్టర్ అందరినీ ఆశ్చర్య పరుస్తుంది. అది ఒక పల్లెటూరి పిల్ల పాత్ర. ఈ పాత్ర నటనా ప్రదర్శనకు చాలా స్కోప్ కలిగి ఉంది," అని రష్మిక పుష్ప సినిమా లోని తన క్యారెక్టర్ గురించి వెల్లడించారు. తాను రెండవ పార్టులో కూడా కనిపించనున్నానని ఇదే ఇంటర్వ్యూలో రష్మిక వెల్లడించారు. ఈ రెండు భాగాలలో తాను పోషిస్తున్న పాత్ర తనకు మంచి గుర్తింపు తెచ్చి పెడుతుందని ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు. అయితే నటనా చాతుర్యాన్ని చూపించడానికి ఎంతో అవకాశం ఉందని రష్మిక చెప్పడంతో ఆమె పుష్ప సినిమాలో తన అద్భుతమైన నటనతో ఇరగదీస్తారని అప్పుడే అభిమానుల్లో ఊహాగానాలు మొదలయ్యాయి.

క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి