ప్రపంచ వ్యాప్తంగా తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆతృతతో ఎదురు చూస్తున్న ‘ఆర్ ఆర్ ఆర్’ మూవీ విడుదల తరువాత తెలుగు సినిమా ఇండస్ట్రీకి మళ్ళీ పునర్వైభవం వస్తుందని అంతా ఆశిస్తున్నారు. ఇప్పటికే కరోనా పరిస్థితులు వల్ల అనేక సార్లు వాయిదా పడ్డ ‘ఆర్ ఆర్ ఆర్’ షూటింగ్ తిరిగి ప్రారంభం కావడానికి కౌంట్ డౌన్ మొదలైంది.

జూలై ఫస్ట్ నుండి ‘ఆర్ ఆర్ ఆర్’ షూటింగ్ మళ్ళీ మొదలుకాబోతున్న పరిస్థితులలో ఈమూవీలోని కీలక నటీనటులను సిద్ధంగా ఉండండి అంటూ ఇప్పటికే రాజమౌళి నుంచి పిలుపు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ మూవీకి సంబంధించి ఇంకా 45 రోజుల షూటింగ్ పెండింగ్ లో ఉండటంతో ఇక నుంచి ఒక్కరోజు కూడ వృధా కాకూడదు అన్న పక్కా ప్లాన్ లో జక్కన్న ఉన్నట్లు టాక్.

ఈ నేపధ్యంలో ఈ మూవీలో కీలక పాత్రలో నటిస్తున్న అలియా భట్ సూచనల పై ఈమూవీ షూటింగ్ షెడ్యూల్ లో చాల మార్పులు జరిగినట్లు తెలుస్తోంది. అలియా భట్ ప్రస్తుతం బాలీవుడ్ లో అనేక సినిమాలలో నటిస్తూ బిజీగా ఉండటంతో ముందుగా ఆమెకు సంబంధించి పెండింగ్ లో ఉన్న సీన్స్ ను అదేవిధంగా చరణ్ అలియా భట్ లపై తీయవలసిన పాటను ముందుగా చిత్రీకరిస్తారని తెలుస్తోంది.

ఆతరువాత ఈ మూవీలో మరో కీలక పాత్రలో నటిస్తున్న అజయ్ దేవగణ్ పై చిత్రీకరించ వలసిన సీన్స్ ను పూర్తి చేస్తారట. ఆతరువాత చరణ్ జూనియర్ లపై చిత్రీకరించ వలసిన కొన్ని కీలక సీన్స్ ఆతరువాత వీరిద్దరి పై తీయబోతున్న ఒక పాటతో పాటు ఈ మూవీకి సంబంధించిన ప్రీ క్లైమాక్స్ సీన్స్ ను కూడ రాజమౌళి ఎలాంటి బ్రేక్ లేకుండా షూట్ చేస్తాడట. ఈసారి మళ్ళీ వాయిదా అనే పదం లేకుండా పక్కా ప్లాన్ తో ఈమూవీ రిలీజ్ డేట్ ను అన్నీ ఆలోచించుకుని ఫిక్స్ చేయాలని రాజమౌళి ఆలోచన..


మరింత సమాచారం తెలుసుకోండి: