తెలుగు మూవీస్ లో చాలా పాటలు వస్తుంటాయి. కానీ.. పెళ్లి వచ్చే పాటలు మాత్రం చాలా తక్కువగానే ఉన్నాయి. అయితే పెళ్లిపై వచ్చిన పాటలు ఏంటో ఒక్కసారై చూద్దామా. ఆనంద్ దేవరకొండ హీరోగా వస్తున్నా సినిమా పుష్పక విమానం. ఈ సినిమాని దామోదర దర్శకత్వంలో నిర్మించారు. ఈ చిత్రానికి రామ్ మిరియాల సంగీతం అందించారు. ఈ సినిమాలో శాన్వీ మేఘన, గీత్ సైని, సునీల్, నరేష్, కిరీటి దామరాజు తదితరులు నటించారు. పుష్పక విమానం సినిమాలో కళ్యాణం కమనీయం అంటే పాటను పెళ్లిపై చిత్రీకరించారు.



నితిన్ హీరోగా రాఖీకన్నా హీరోయిన్ గా నటించిన సినిమా శ్రీనివాస కళ్యాణం. ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు నిర్మించారు. ఈ చిత్రానికి సతీష్ వేగశ్న దర్శకత్వం వహించారు. ఈ మూవీకి మిక్కీ జె.మేయర్ సంగీతాన్ని అందించారు. ఈ సినిమాలో కళ్యాణం వైభోగం అనే పాటను పెళ్లిపై చిత్రీకరించారు.



సుధీర్ వర్మ దర్శకత్వంలో వచ్చిన సినిమా రణరంగం. ఈ సినిమాలో ఈ చిత్రంలో శర్వానంద్, కాజల్ అగర్వాల్, కళ్యాణి ప్రియదర్శన్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి ప్రశాంత్ పిళ్ళై సంగీతాన్ని అందించారు. ఈ సినిమాలో పెళ్లిపై సీతా కళ్యాణ వైభోగమే అనే పాటను చిత్రీకరించారు.



నాగశౌర్య, మాళవిక నాయర్‌ కలిసి నటించిన చిత్రం కళ్యాణ వైభోగమే. ఈ చిత్రాన్ని నందినీ రెడ్డి దర్శకత్వంలో నిర్మించారు. ఈ సినిమాను శ్రీ రంజిత్ మూవీస్ పతాకంపై ఎఎల్ దామోదర్ ప్రసాద్ నిర్మించారు. ఈ  సినిమాకు కళ్యాణ్ కోడూరి సంగీతం అందించారు. ఈ సినిమాలో పెళ్లిపై చక్కందాల చుక్క అనే పాటను చిత్రీకరించారు.



గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన సినిమా వరుడు. ఈ సినిమాలో అల్లు అర్జున్‌, భానుశ్రీ మోహ్రా జంటగా కలిసి నటించారు. ఈ సినిమాకి డీవీవీ దానయ్య నిర్మాతగా వ్యవహరించారు. ఈ మూవీకి మణి శర్మ సంగీతం అందించారు. ఈ సినిమాలో అయిదు రోజుల పెళ్లి అనే పాటను చిత్రీకరించారు.



సతీష్ వేగేశ్న దర్శకత్వంలో వచ్చిన సినిమా శతమానంభవతి. ఈ సినిమాను దిల్ రాజు నిర్మించారు. ఈ చిత్రంలో శర్వానంద్‌, అనుపమ పరమేశ్వరన్‌ కలిసి జంటగా నటించారు. ఈ మూవీకి మిక్కీ జె.మేయర్ సంగీతాన్ని అందించారు. ఈ సినిమాలో పెళ్లిపై వధువేమో అలమేలు అనే స్ పాటను చిత్రీకరించారు.



మహేష్ బాబు, సోనాలీ కలిసి నటించిన సినిమా మురారి. కృష్ణవంశీ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని చిత్రీకరించారు. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతన్ని అందించారు. ఈ సినిమాలో అలనాటి రామచంద్రుడు అనే పాటను చిత్రీకరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: