అందం అభినయంతో ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న నటి కృతిసనన్. మహేష్ బాబు హీరోగా నటించిన 1 నేనొక్కడినే సినిమాతో తెలుగు ప్రేక్షకులను తొలి పరిచయంలోనే మెప్పించింది. తొలుత ఈ సినిమాకి
కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా ఎన్నుకోబడ్డ ఆమె తర్వాత డేట్స్ ఖాళీ లేక సర్డు బాటు చేయలేక ఈ సినిమాలో నటించడానికి మక్కువ చూపని కారణంగా ఈమెను కథానాయికగా ఎంచుకున్నారు. 2014లో విడుదలైన ఈ సినిమాలో ఆమె విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకొని మంచి నటిగా పేరు సంపాదించుకుంది. కొత్త నటి అనే ఫీలింగ్ కలిగించకుండా జాగ్రత్త పడింది.
ఆ తర్వాత టైగర్ సరసన ఆమె హీరోపంటి చిత్రంతో
హిందీ ప్రేక్షకులకు పరిచయమై మరింత క్రేజ్ను సంపాదించుకుంది. నటిగా బలమైన పాత్రల్ని పోషించాలి అనుకుంటున్నాను,ఇప్పటివరకూ కనిపించని కొత్త పాత్రలను ఎంపిక చేసుకునే దిశగా సాగుతాను అని ఆమె ఒక సందర్భంలో చెప్పినట్లు గా వరుస విభిన్నమైన పాత్రలు ఎంపిక చేసుకుంటూ సవాలుతో కూడిన సినిమాలను చేస్తూ అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరించే విధంగా దూసుకు పోతూ ఉంది. ఎలాంటి పాత్రకైనా న్యాయం చేయగల ఈమె ప్రస్తుతం
ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ఆదిపురుష్ లో మరియు మరికొన్ని
హిందీ సినిమాల్లో నటిస్తోంది.
ఇకపోతే ఈమె చెల్లెలు నుపుర్ సనన్ కూడా
సినిమా పరిశ్రమలో
హీరోయిన్ గా సత్తా చాటాలని చూస్తుంది. అందానికి అందం , గ్లామర్ కి గ్లామర్ కలిసినట్లుగా ఉండే నుపుర్ సోషల్
మీడియా ద్వారా ప్రేక్షకులకు పరిచయమైంది. తన హాట్ హాట్ ఫోటోలతో ప్రేక్షకులను మైమరపించే ఈమెను
వెండి తెరపై చూడాలని ఎంతగానో ఎదురు చూస్తున్నారు ఆమె అభిమానులు. కొన్ని రోజుల క్రితం
సుశాంత్ రాజ్ పుత్ హీరోగా ఓ సినిమాలో ఈమె
హీరోయిన్ గా పరిచయం అవుతుంది అని కూడా అన్నారు. కానీ ఆమెకు అదృష్ట భరించలేదు
సినిమా విషయాలు ఎలా ఉన్నా అన్నం పరంగా ఇద్దరు ముద్దుగుమ్మలకు మాత్రం ఏమి లోటు ఉండదు. ఇద్దరి అందం వేరే హీరోయిన్ల కంటే కూడా అంతకు మించి అనేలా ఉంటుంది. మరి ఈ నేపథ్యంలో ఆమె ఎప్పుడూ సినీ రంగ ప్రవేశం చేస్తుంది అని ఆమె అభిమానులు ఎదురు చూస్తున్నారు.