విక్రమార్కుడు నుంచి బాహుబలి సినిమా వరకు బాగా మంచి పేరు సంపాదించిన అనుష్క శెట్టి..అయితే ఇటీవల కాలంలో దాదాపుగా మూడు సంవత్సరాల నుంచి ఒక హిట్ సినిమా కూడా తన ఖాతాలో పడలేదు. అసలు ఈ స్వీటీ ఇప్పుడు ఏం చేస్తుందో కూడా ఎవరికీ తెలియదు. అనుష్క సోషల్ మీడియాకు  కూడా దూరంగానే ఉండేది. కానీ ఇప్పుడు అనుష్క దగ్గరనుంచి ఒకే అనూహ్య స్పందన వచ్చింది అది ఏమిటో చూద్దాం.


స్టార్ హీరోయిన్ గా ఎదిగిన వారిలో అనుష్క కూడా ఒకరు. సైజ్ జీరో సినిమా కోసం చాలా లావుగా తయారైన అనుష్క,  ఇక బరువు తగ్గడానికి చాలా సమయం పట్టింది. దాంతో ఆమె తక్కువగా సినిమాలు చేస్తోంది. అయితే అసలు విషయానికి వస్తే, అనుష్క కొద్ది నెలల క్రితం తన పుట్టినరోజు సందర్భంగా తన అమ్మానాన్నలతో ఉన్న ఒక ఫోటోను షేర్ చేసింది సోషల్ మీడియాలో..

ఇక ఈమె అందరితో కలిసి ఉండాలి అనుకొని, తన ట్విట్టర్ ఖాతా నుంచి " Hai " అంటూ పోస్ట్ పెట్టి అందరిని పలకరించింది. కొత్తగా వచ్చిన "కూ" యాప్ ద్వారా మీకు అందుబాటులోనే ఉంటానని తెలిపింది. ట్విట్టర్ కు భారతదేశ కేంద్ర ప్రభుత్వం కొన్ని ఆంక్షలు విధించడం వల్ల "కూ" అనే యాప్ బాగా పాపులర్ చేయాలని ఆ సంస్థ వారు చూస్తున్నారు. ఇక ఈ యాప్ లో అనేకమంది స్టార్స్, పొలిటిషన్ ఇందులో చేరాలని చూస్తున్నారు. ఇందులో సామాన్య ప్రజలు కూడా చేరారు. అందుకే అనుష్క కూడా ఈ యాప్ లోకి లాగిన్ అయింది. దీన్నే ట్విట్టర్ ద్వారా పోస్ట్ చేసింది.

"అంతేకాకుండా హాయ్ ఆల్... ఈ కరోనా సమయంలో మీరందరూ ఇంట్లోనే ఉంటూ, జాగ్రత్తగా ఆరోగ్యంగా ఉన్నారని భావిస్తున్నాను. ఇక నా గురించి భవిష్యత్తులో ఏదైనా  సమాచారం తెలుసుకోవాలనుకుంటే నా ఖాతా ను ఫాలో అవ్వండి". అంటూ ధన్యవాదాలు తెలిపింది అనుష్క. దీనిని ట్విట్టర్ద్వారా తెలిపింది. ప్రస్తుతం ఈ ట్వీట్ బాగా వైరల్ గా మారింది."కూ" అనే యాప్ ద్వారా అభిమానులకు చేరువలో ఉంటాను అంటోంది..



మరింత సమాచారం తెలుసుకోండి: