మన హీరోలు ఒక్క పాత్రకే పరిమితం కాకుండా ద్విపాత్రాభినయం, త్రిపాత్రాభినయం కూడా చేసి ప్రేక్షకులను అభిమానులను ఎంతగానో అలరించారు. తమ అభిమాన హీరోను ఒకరిని చూస్తేనే ఆగని ప్రేక్షకులు ఇద్దరిలా ముగ్గురిలో కనిపించి వారు ఎంతగానో ఖుషీ అయ్యేలా అలరించారు. నిజానికి హీరోలకు కూడా ద్విపాత్రాభినయంలో త్రిపాత్రాభినయం లో కనిపించడం ఒక పెద్ద సవాల్.

ఆ విధంగా ఎన్టీఆర్, చిరంజీవి, బాలకృష్ణ , నాగార్జున వంటి హీరోలు చాలామంది ఈ తరహాలో ప్రేక్షకులను అలరించగా  కొంతమంది హీరోలు మాత్రమే త్రిపాత్రాభినయం చేయగలిగారు. ఆ విధంగా టాలీవుడ్ లో చేసిన ఏ హీరోలు ఈ విధంగా ప్రేక్షకులను అలరించారు అనేది ఇప్పుడు చూద్దాం. మెగాస్టార్ చిరంజీవి ముగ్గురు మొనగాళ్లు సినిమా లో త్రిపాత్రాభినయం లో అలరించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఈ సినిమాలో రౌడీగా, పోలీసాఫీసర్ గా, బ్రాహ్మణుడిగా చిరంజీవి తనదైన నటన ప్రదర్శించి అభిమానులను ఉర్రూతలూగించారు.

నందమూరి బాలకృష్ణ అధినాయకుడు సినిమాలో ట్రిపుల్ రోల్ చేసి ఇ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టు కున్నారు తాత తండ్రి మనవడు మూడు పాత్రల్లో బాలకృష్ణ అదరగొట్టారు. అంతే కాకుండా ప్రస్తుతం ఆయన చేస్తున్న అఖండ సినిమాలో కూడా మూడు షేడ్స్ ఉన్న పాత్రలను చేస్తున్నారట. మరి ఈ మూడు షేడ్స్ త్రిబుల్ రోల్స్ అన్న విషయం తెలియాల్సి ఉంది. నందమూరి తారక రామారావు జై లవకుశ సినిమాలో త్రిబుల్ రోల్ లో నటించి ఇప్పటి తరం హీరోలలో ఈ ఫీట్ సాధించిన హీరోగా చరిత్ర సృష్టించాడు. కొబ్బరి మట్ట చిత్రంలో సంపూర్ణేష్ బాబు కూడా త్రిబుల్ రోల్ లో నటించారు. ఆ కాలంలో ఏఎన్ఆర్ తొమ్మిది పాత్రలు చేయగా, దాన వీర శూర కర్ణ సినిమా లో మూడు పాత్రల్లో సీనియర్ ఎన్టీఆర్ మెప్పించాడు. మరి భవిష్యత్ లో ఈ తరహాలో ఏ హీరోలు నటిస్తారో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: