
మెగాస్టార్ చిరంజీవి తన రీ ఎంట్రీ లో వరస సినిమాలు చేసుకుంటూ పోతున్న విషయం అందరికి తెలిసిందే. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య అనే సినిమా చేస్తున్నాడు చిరంజీవి. 65 ఏళ్ల వయసులో ఆయన స్పీడు చూసి తోటి స్టార్ హీరోలు, యంగ్ హీరోలు కూడా షాక్ అవుతున్నారు. ఈ సినిమానే కాకుండా ఆయన మరో మూడు సినిమాలను సెట్స్ పైకి తీసుకెల్లాడు. ఆచార్య పూర్తయిన వెంటనే మోహన్ రాజా దర్శకత్వంలో లూసిఫర్ అనే మలయాళ రీమేక్ లో నటించే పోతున్నారు మెగాస్టార్. ఈ చిత్రం పూర్తయ్యాక మెహర్ రమేష్ డైరెక్షన్ లో వేదలం రీమేక్ లో, ఆ తర్వాత డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు.
వీటిలో రెండు సినిమాలు రీమేక్ కాగా బాబీతో చేయబోయే సినిమా డైరెక్ట్ తెలుగు సినిమా. గత ఏడాది ఈ సినిమా నీ ఓకే చేశారు. కానీ ఎప్పుడు సెట్స్ పైకి వెళుతుంది అనే విషయంపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. అయితే movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ వారు ఈ ప్రాజెక్టుని నిర్మించబోతున్నట్లు మాత్రం చెప్పారు. ఇక ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన పనులు శరవేగంగా జరుగుతున్నాయి అని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రంలో హీరోయిన్ గా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సోనాక్షి సిన్హా ను తీసుకోబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ఇప్పటికే నిర్మాతలు ఆమెతో సంప్రదింపులు జరిపినట్లు ఇన్సైడ్ వర్గాల సమాచారం ప్రకారం తెలుస్తోంది. అయితే ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందా లేదా అనే విషయంపై మాత్రం స్పష్టత లేదు. ఈ మధ్యకాలంలో స్టార్ నటులను టాలీవుడ్ తీసుకువచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు మన మైత్రి నిర్మాతలు. మైత్రి వారు పుష్ప సినిమాలో మలయాళ నటుడునీ తీసుకురాగా నాని హీరోగా నటిస్తున్న అంటే సుందరానికి సినిమా కోసం నజ్రియాను తీసుకువచ్చారు. కోలీవుడ్ స్టార్ విజయ్ ను టాలీవుడ్ కు తీసుకువస్తున్నారు. దక్షిణాది తర్వాత ఈ నిర్మాతల కన్ను బాలీవుడ్ పై పడినట్లు స్పష్టంగా తెలుస్తోంది. ఇప్పుడు సోనాక్షి సిన్హా ను ప్రయత్నిస్తున్నారు. సల్మాన్ ఖాన్ తో సినిమా చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు వీరు.