తెలుగు
సినిమా పరిశ్రమలో నట దిగ్గజం ఎస్.వి.రంగారావు. సాంఘిక, జానపద, పౌరాణిక సినిమాల్లో నటించి ప్రేక్షకులచే వారేవా అనిపించుకున్న మహానటుడు ఈయన. రావణుడు, కంసుడు, హిరణ్యకశ్యపుడు, కీచకుడు, ఘటోత్కచుడు సహా ఎన్నో పాత్రల్లో జీవించి మెప్పించిన ఈ నట శిఖరం నటనకు ఎవరైనా దాసోహం కావాల్సిందే. అభినందనల వర్షం కురిపించాల్సిందే. తోటి నటీనటుల ప్రశంసలు అందుకుని ప్రేక్షకుల అభిమానంతో ఇంతటి ఎత్తుకు ఎదిగారు ఎస్.వి.రంగారావు.
ఆయనకు మొదటి నుంచి నటన అంటే ఎంతో మక్కువ. అందుకే ఆయన ఉద్యోగం చేస్తున్న సినిమాల పైనే మనసంతా ఉండేది. చివరకు ఉద్యోగం మానేసి
సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టాడు. తొలినాళ్లలో ఆయన చేసిన సినిమాలు అంతగా ఆడలేదు అయిన సినిమాల కోసం ప్రయత్నాలు కొనసాగాయి. చివరకు ఓ మంచి
సినిమా తగిలింది.
షావుకారు జానకి సినిమా లో ఓ మంచి పాత్ర పోషించాడు. ఆ పాత్ర ద్వారా ఆయనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి.
తొలి
సినిమా తర్వాత ఆయనకు మ రో అద్భుత అవకాశం లభించింది. పాతాళభైర
వి సినిమా లో మాంత్రికుడి పాత్ర దక్కింది. నాగిరెడ్డి నిర్మాణం లో కె.వి.రెడ్డి దర్శకత్వం లో ఈ సిని మా తెరకెక్కింది. అయితే ఈ సినిమాలో పాత్ర అత్యంత కీలకమైనది ఇంతటి ప్రాముఖ్యత కలిగిన పాత్ర అప్పుడప్పుడే ఎదుగుతున్న ఎస్వీఆర్ కు ఇవ్వడం సాహసం అవుతుంది అని సన్నిహిత దర్శక నిర్మాతలు చిత్ర దర్శక నిర్మాతలకు చెప్పారు. ఈ విషయం తెలిసి కెసిఆర్ నిరాశ చెంది ఎక్కడ ఆయనకు వచ్చిన ఈ అద్భుత అవకాశం చాలా టెన్షన్ పడ్డారు. కానీ ఎస్వీఆర్ పై నమ్మకం పెట్టుకున్నారు దర్శకనిర్మాతలు. ఈ
సినిమా లో మాంత్రికుడు పాత్రను అయనచే చేయించి వారి నమ్మకం చాటుకున్నారు. ఆ పాత్ర ఎస్
వి రంగారావు గారికి ఎంతో మంచి పేరు తెచ్చిపెట్టింది.