
టాలీవుడ్ లో అదృష్టం బాగుంటే ఒకటి రెండు సినిమాలతోనే స్టార్ డైరెక్టర్ గా మారిపోవచ్చు. తమలోని దర్శకత్వ ప్రతిభను మొదటి సినిమాతోనే చూపించి రెండో సినిమా తో మంచి హీరో తో చేసే అవకాశం దక్కించుకుని స్టార్ దర్శకులు అయ్యారు చాలామంది. అలా చేసిన కొన్ని సినిమాలతోనే స్టార్ దర్శకులుగా ఎదిగిన డైరెక్టర్ లు ఎవరో ఇప్పుడు చూద్దాం. దేశాన్ని మొత్తం కుదిపేసిన కేజిఎఫ్ సినిమా దర్శకుడు ఈ సినిమా కంటే ముందు చేసింది ఒక్క చిత్రం మాత్రమే. ఉగ్రం సినిమాతో కన్నడలో దర్శకుడిగా పరిచయమైన ప్రశాంత్ నీల్ రెండో సినిమాతోనే దేశం గర్వించదగ్గ దర్శకుల్లో ఒకరు అయ్యారు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో సినిమా చేయాలని ప్రతి దర్శకుడు ఎన్నో కలలు కంటూ ఉంటాడు. అలాంటి అవకాశం కెరియర్ మొదట్లోనే వస్తే ఆ దర్శకుడికి ఎంతో అదృష్టం ఉందని చెప్పొచ్చు. ఆ విధమైన అదృష్టాన్ని అందుకున్నాడు దర్శకుడు వేణు శ్రీరామ్. తన కెరియర్ లో మూడో సినిమానే పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరోలతో చేసే అవకాశాన్ని అందుకోవడం మాత్రమే కాకుండా వకీల్ సాబ్ సినిమా ద్వారా సూపర్ హిట్ కొట్టాడు కూడా. గోపీచంద్ జిల్ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన రాధాకృష్ణ తన రెండవ సినిమా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో చేస్తున్నాడు.
త్వరలో వీరిద్దరి కలయికలో రాధేశ్యామ్ సినిమా విడుదల కానుంది. దర్శకుడు సాగర్ చంద్ర అయ్యారే , అప్పట్లో ఒకడుండేవాడు వంటి చిన్న సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుని ఇప్పుడు పవన్ కళ్యాణ్ తో సినిమా ఛాన్స్ కొట్టేశాడు. దర్శకుడు నాగ్ అశ్విన్ కూడా ఎవడే సుబ్రహ్మణ్యం, మహానటి వంటి మీడియం రేంజ్ సినిమాలను చేసి ప్రభాస్ తో పాన్ ఇండియా సినిమా తెరకెక్కించే లెవెల్ కి చేరుకున్నాడు. మరి ఈ భారీ ప్రాజెక్టుల తో రాబోయే దర్శకులు తమ రేంజ్ ను నెక్స్ట్ ఏ రేంజ్ లో పెంచుకుంటారో చూడాలి.