ప్రస్తుతం దక్షిణాది సినిమాలను బాలీవుడ్ లో రీమేక్ చేయడం సర్వసాధారణం అయిపోయింది. ఇప్పటికే చాలా సినిమాలు అక్కడ రీమేక్ అయి బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి. సార్ హీరోలు సైతం సౌత్ సినిమాల పై మోజు పడుతూ ఎంతో మనసుపెట్టి తెరకెక్కించి వారు హిట్ అందుకుంటున్నారు.  సల్మాన్ ఖాన్ గతంలో చాలా సినిమాలను సౌత్ నుంచి బాలీవుడ్ లో రీమేక్ చేసి హిట్లు కొట్టగా గా ఇటీవలే రెండు తెలుగు సినిమాలను రీమేక్ చేయడానికి సిద్ధమవుతున్నారట. వీటిలో తెలుగులో ఇంకా రిలీజ్ అవ్వని సినిమాను ఆయన రీమేక్ చేస్తున్నారు. అలాగే బాలీవుడ్ యాక్షన్ చిత్రాల హీరో అక్షయ్ కుమార్ కూడా ఒక తమిళ సినిమా రీమేక్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆ సినిమా తెలుగులో కూడా రీమేక్ అయి బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో అక్షయ్ కుమార్ అక్కడ రీమేక్ చేస్తున్నారట.

అలాగే షాహిద్ కపూర్ తెలుగులో నాని నటించిన జెర్సీ సినిమా ను అదే పేరుతో అక్కడ చేయబోతున్న విషయం తెలిసిందే. నాని చాలా సీన్లలో నన్ను ఏడిపించాడు అని ఇటీవలే షాహిద్ పెట్టిన పోస్ట్ అందరిలో సినిమా పై ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఇదిలా ఉంటే బాలీవుడ్ లో మరొక సౌత్ సినిమా రీమేక్ కాబోతుంది. మలయాళంలో మమ్ముట్టి నటించిన సూపర్ హిట్ సినిమా వన్ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేసేందుకు బోనికపూర్ హక్కులను సొంతం చేసుకున్నారు. పొలిటికల్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం హక్కులను ఆయన భారీ రేటు తో కొనుగోలు చేశారు. సంతోష్ విశ్వనాధ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మమ్ముట్టి ముఖ్యమంత్రి పాత్రలో నటించారు.

హిందీ రీమేక్ లో ఓ పెద్ద నటుడు ఈ పాత్రను పోషిస్తారని తెలుస్తోంది. అలాగే  అన్నా బెన్ నటించిన హెలెన్ హక్కులను కూడా సొంతం చేసుకున్నారు బోనీ కపూర్..  అజయ్ దేవగన్ మైదాన్ ను పూర్తి చేశాక ఈ చిత్రం షూటింగ్ ప్రారంభిస్తారు. తన కుమారుడు అర్జున్ కపూర్ తో కలిసి వరుసలో ఉన్న 2019 తమిళ చిత్రం కోమలి హిందీ రీమేక్ కు ఆయన మద్దతు ఇవ్వనున్నారు. అలాగే ఆయుష్మాన్ ఖురానా నటించిన ఆర్టికల్ 15 సినిమాను తమిళంలోకి రీమేక్ చేయనున్నారు.  ఇకపోతే 2022 మొదటి భాగంలో వన్ సినిమా సెట్స్ మీదకు వెళుతుందని సమాచారం.  ఇటీవలే నెట్ ఫ్లిక్స్ లో విడుదలై వన్ cinema భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: