
జయం సినిమా ద్వారా టాలీవుడ్ కి పరిచయమైన హీరోయిన్ సదా ఆ తర్వాత ఎన్నో చిత్రాలలో నటించి ప్రేక్షకులను తన నటనతో అలరించారు. గ్లామర్ పాత్రలకు, నటనకు ఆస్కారం ఉన్న పాత్రలు సైతం అవలీలగా చేస్తూ కోట్లాది మంది ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించుకున్న సదా ఆ తర్వాత కాలంలో సినిమాలను తగ్గిస్తూ వచ్చారు. ఇతర కథానాయికల జోరుతో ఆమెకు సినిమా అవకాశాలు తగ్గాయని చెప్పవచ్చు. అవకాశాలు తగ్గిపోవడంతో ఆమె సినిమాలకు దూరంగా ఉన్నారు. తెలుగులోనే కాకుండా తమిళం మలయాళం కన్నడ భాషల్లో కూడా ఆమె తన సత్తా చాటి టాప్ హీరోయిన్ గా కొన్ని రోజులు సినీ ఇండస్ట్రీ ని ఏలారు. ప్రస్తుతం ఆమె ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొనగా ఆ ఇంటర్వ్యూ యూట్యూబ్ లో ట్రెండింగ్ గా మారింది.
ఆమె తెలుగు తెరపై కనిపించక దాదాపు ఐదు ఏళ్ళు అవుతుంది. ఈ నేపథ్యంలో ఇంటర్వ్యూలో బుల్లి తెరపై మెరిసిన ఆమె కెరీర్ పరంగా ఎన్నో ఆసక్తికర విషయాలు ప్రేక్షకులతో పంచుకోగా, చంద్రముఖి సినిమాలో జ్యోతిక చేసిన పాత్ర కోసం ముందుగా తనను అడిగారని ఆ సమయంలో వేరే సినిమా చేయడంతో వదులుకోవాల్సి వచ్చిందని చెప్పింది. తనకు లైఫ్లో గుర్తుండిపోయే వచ్చిన ఒక మంచి అవకాశాన్ని వదులుకోవాల్సి వచ్చింది అన్నారు. హీరోయిన్ నయనతార పాత్ర కోసం కూడా తనను అడిగారని తెలిపింది.
అలా రెండు అవకాశాలు నాకు రావడంతో తాను వేరే సినిమా చేస్తున్న సదరు దర్శక నిర్మాతలను రజనీకాంత్ తో నటించే అవకాశం వచ్చింది ఆ సినిమాలో నేను నటించవచ్చు అని అడగ్గా ఆ దర్శకనిర్మాతలు మరొకసారి వద్దని చెప్పారు. అన్నారు. అలా నేను చేయాల్సిన ఆ రెండు పాత్రలు జ్యోతిక కు, నయనతారకు వెళ్ళాయి. నిజంగా చంద్రముఖి సినిమా చేసే అవకాశం లేకపోవడం నా దురదృష్టం. ఈ విషయం నన్ను ఎప్పటికీ బాధిస్తూనే ఉంటుంది. శేఖర్ కమ్ముల గారి ఆనంద్ సినిమాలో నటించలేకపోయాను. అందుకు కారణం ఎవరో కాదు నేనే. ఆ సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం నన్ను అడిగారు. కొత్త దర్శకుడు కొత్త ప్రొడక్షన్ ఎలా ఉంటుందో ఏమిటో అనే సందేహంతో ఆ సినిమా వదిలేశాను. నిజంగా ఆ సినిమా చూసి ఉంటే బాగుండేది అని ఇప్పుడు అనిపిస్తుంది అన్నారు.