
సినిమా ఇండస్ట్రీలో నటీనటులు ప్రేమలో పడటం సహజం. అందులో కొంతమంది పెళ్ళిళ్ళు చేసుకుంటారు. ఇంకొంతమంది పెళ్లికి ముందే బ్రేకప్ చెప్పుకోవడం జరుగుతుంది. ఇవన్నీ వారి జీవితాల్లో ఎంతో సర్వసాధారణమైన విషయం కానీ ఒక్కొక్కసారి ఈ ప్రేమ వారి జీవితాలను ప్రశ్నార్థకం చేస్తుంది. ఎవరు చేరుకోవాలని అవతలి తీరానికి విసిరేస్తోంది. కాలం కూడా నయం చేయలేని గాయాలను మిగులుస్తుంది. అలా ఇప్పుడు మనం చెప్పుకోబోయే ప్రేమజంట విషయంలోనూ జరిగింది. ప్రేమ వల్ల, ప్రేమించడం వల్ల తన జీవితాన్ని సినిమా కెరీర్ నాశనం చేసుకున్న ఆ హీరోయిన్ ఎవరో ఇప్పుడు చూద్దాం.
నిన్నటి తరం యువతకు చాలా దగ్గరైన హీరోయిన్ హీరా రాజగోపాల్. మంచి సినిమాలతో పాటు విపరీతమైన క్రేజ్ ఆమె సొంతం. తన అందచందాలతో ఎంతో మంది యువకులను తన అభిమానులుగా మార్చుకున్న ఈమె చెన్నైలో డాక్టర్ల కుటుంబంలో జన్మించి మద్రాసులోనే గొప్ప చదువులు చదివింది. మోడలింగ్ లో అవకాశాలు వచ్చిన తదనంతరం హీరోయిన్ గా ఎదిగింది. సౌత్ ఇండస్ట్రీ లో అన్ని భాషల్లో నటించిన ఈమె తమిళ భాషలో ఒకానొక సమయంలో స్టార్ హీరోయిన్ గా తన సత్తా చాటుకుంది అని చెప్పవచ్చు.
ఇక్కడ వరకు అంతా బాగానే ఉన్నా అప్పుడప్పుడే ఏ సినిమా అవకాశాలను సంపాదించుకుంటున్న అజిత్ పరిచయం ఆమె జీవితాన్ని మలుపు తిప్పింది. సినిమా అవకాశాల కోసం అజిత్ హీరా పరిచయాలను వాడుకున్నాడు అని అంటూ ఉంటారు. అయితే తాను హిట్ లని చూడగానే స్టార్ గా ఎదగగానే హీరా తో సంబంధాలు తెంచుకున్నాడు అనే వార్త ఇప్పటికీ తమిళనాడు లో ప్రచారం అవుతుంది. ప్రేమనే జీవితం అనుకున్న హీరా మాత్రం ఆ గాయం నుండి తేరుకోలేక పోయింది. సినిమా ఇండస్ట్రీ తనకు సరిపోదు అని రిటైర్మెంట్ ప్రకటించి ఓ వ్యాపార వేత్తను పెళ్లి చేసుకుని శాశ్వతంగా నటన నుంచి వెళ్ళిపోయింది. ఆ పెళ్లి కూడా మూడునాళ్ళ ముచ్చట అయింది. చివరికి ఈ దేశం వదిలి అమెరికాలో సెటిల్ అయింది. మళ్ళీ పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా జీవితాన్ని గడుపుతుంది.