ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన టాకీ పార్ట్ ను పూర్తి చేసినట్లుగా ప్రకటించిన రాజమౌళి ఈ మూవీకి సంబంధించి తాను తీయవలసిన రెండు పాటల విషయమై పూర్తిగా శ్రద్ధ పెట్టినట్లు తెలుస్తోంది. ఈ పరిస్థితుల మధ్య జక్కన్న హడావిడిగా రష్యాకు దగ్గరలో ఉన్న ఉక్రెయిన్ కు వెళ్ళి రావడం వెనుక ఒక కారణం ఉంది అన్న ప్రచారం జరుగుతోంది.
ఉక్రెయిన్ లో ఎన్టీఆర్ ఒలివియా మోరిష్ పై ఒక ప్రత్యేక గీతాన్ని అద్భుతమైన లోకేషన్స్ లో చిత్రీకరించడానికి ఉక్రెయిన్ తనకు చాల అనువైన ప్రాంతం అని రాజమౌళి భావిస్తున్నట్లు టాక్. దీనికి కారణం ఉక్రెయిన్ దేశంలో ప్రజలందరికీ 100 శాతం కరోనా వెక్సినేషన్ రెండు డోసులు పూర్తి కావడంతో అక్కడ ప్రస్తుతం కరోనాకు సంబంధించి జీరో కేసులు నమోదు కావడం అని అంటున్నారు.
భారత్ లో అందమైన లోకేషన్స్ ఉన్న అనేక ప్రాంతాలు ఉన్నప్పటికీ ఇప్పటికి వరకు భారత్ లో కేవలం 30 కోట్లమందికి మాత్రమే వెక్సినేషన్ పూర్తి కావడంతోపాటు 100 శాతం వ్యాక్సినేషన్ పూర్తి కావడానికి చాల సమయం పడుతుంది కాబట్టి మళ్ళీ అనుకోకుండా ‘ఆర్ ఆర్ ఆర్’ టీమ్ కు కరోనా సమస్యలు ఎదురై మళ్ళీ షూటింగ్ కు బ్రేక్ పడుతుందేమో అన్న భయంతో రాజమౌళి ఉక్రెయిన్ ప్రాంతాన్ని ఎంచుకున్నాడు అంటూ వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియోస్ లో వేసిన రెండు ప్రత్యేకమైన సెట్స్ లో చరణ్ అలియా భట్ జూనియర్ ఒలివియా మోరిష్ లు పై రెండు పాటలు చిత్రీకరించడానికి రంగం సిద్ధం అయినప్పటికీ కరోనా భయాల రీత్యా రాజమౌళి ఉక్రెయిన్ ప్రాంతానికి ఓటు వేసినట్లు టాక్..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి