
నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా లో బాలకృష్ణ రెండు విభిన్న పాత్రల్లో నటిస్తుండగా గతంలో వీరి కాంబినేషన్ లో వచ్చిన సినిమా లు సూపర్ హిట్ కావడంతో ఈ సినిమాపై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. దానికి తోడు నందమూరి బాలకృష్ణ వరుస ఫ్లాప్ లతో సతమతం అవుతుండటంతో ఈ సినిమా తప్పకుండా హిట్ అవ్వాల్సిన పరిస్థితి నెలకొనడంతో బోయపాటి శ్రీను ను తీసుకువచ్చి ఈ సినిమాను చేస్తున్నాడు బాలకృష్ణ. ఈ నేపథ్యంలో ఈ సినిమా సూపర్ హిట్ అవుతుందని ప్రతి ఒక్కరు నమ్ముతున్నారు.
తమన్ సంగీత సారధ్యంలో తెరకెక్కిన ఈ సినిమా నుంచి ఇప్పటికే రెండు పాత్రలకు సంబంధించిన టీజర్ లు రాగా ఆ సినిమా ఓ రేంజ్ లో ఉండబోతుందని తెలిపాయి. ఇక ఈ సినిమా తర్వాత బాలకృష్ణ వరుస సినిమాలను ఒప్పుకున్న విషయం తెలిసిందే. క్రాక్ సినిమాతో సూపర్ హిట్ సాధించిన దర్శకుడు గోపీచంద్ మలినేని తో బాలకృష్ణ మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై ఓ సినిమా చేయనున్నాడు. అఖండ సినిమా తర్వాత ఈ సినిమానే సెట్స్ పైకి వెళ్లనుంది. వీరిద్దరి కాంబినేషన్ లో రాబోతున్న తొలి సినిమా కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమా తర్వాత అనిల్ రావిపూడి, శ్రీవాస్ ల దర్శకత్వంలో బాలకృష్ణ సినిమాలు చేయనున్నాడట.
ఇటీవలే వీరిద్దరూ బాలయ్య ను కలిసి యాక్షన్ మసాలా కథలు చెప్పగా అవి బాలకృష్ణకు ఎంతో బాగా నచ్చడంతో ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారట. అంతే కాకుండా బాలకృష్ణ రచయిత ఎం రత్నం కథ కూడా ఓకే చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. భారీ చిత్రాలకు రచయితగా పనిచేసిన ఎం రత్నం దర్శకత్వం చేయడానికి ఆలోచిస్తుండగా ఓ కథను బాలయ్య కు వినిపించాడట. ఆ కథ ఆయనకు నచ్చడంతో ఈ సినిమా కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తోంది. దీంతో కలిపి మొత్తం నాలుగు సినిమాలను సెట్స్ పైకి త్వరలోనే తీసుకెళ్ళబోతున్నాడు బాలయ్య. మరి ఈ సినిమాల ఫలితాలు ఏ విధంగా బాలయ్య కు పేరు ను తీసుకు వస్తాయో చూడాలి.