అయితే రేణూ దేశాయ్ లైవ్ లో ఉన్న సమయంలో చాలామంది అకీరానందన్ ఎక్కడ..? అతన్ని ఒకసారి పిలవండి..? చూపించండి అంటూ ప్రశ్నలు వేస్తుంటారు. దానికి రేణూ దేశాయ్ అకీరానందన్ కు ఇలా లైవ్ లో కనబడడం అంతగా ఇష్టం ఉండదని మరియు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉండటం తనకు నచ్చదు అని సమాధానమిస్తారు. అలాగే అకీరానందన్ ఫోటోలను కూడా ఎక్కువగా తన సోషల్ మీడియాను అకౌంట్లో పోస్ట్ చేయరు. కానీ కొద్దిరోజుల క్రితం రేణూదేశాయ్ అకీరా నందన్ ఫోటోను షేర్ చేస్తూ నేను ఎలాంటి సందర్భంలో ఉన్నా... ఏ బాధలో ఉన్నా...నన్ను నవ్వించి ఆనందంగా ఉంచే ఏకైక వ్యక్తి అకీరా అని చెప్పుకొచ్చారు.
కాగా తాజాగా రేణూ దేశాయ్ అకీరానందన్ తో దిగిన సెల్ఫీ ఫోటోను ఇన్స్టాగ్రామ్ పేజీలో షేర్ చేశారు. ఈ ఫోటోకు అద్భుతమైన వ్యక్తి నావెనక ఉన్నప్పుడు నన్ను ఎవరూ బాధపెట్టరు అంటూ రాసుకొచ్చారు. అయితే ఈ ఫోటోకు నెటిజన్ లు ఎలాంటి కామెంట్లు పెట్టకుండా కామెంట్ ఆప్షన్ ను రేణూ దేశాయ్ డిసేబుల్ చేశారు. అయితే రేణూ దేశాయ్ తనను ఎవరూ బాధించలేరు అని రాయండంతో ఎలాంటి కామెంట్లు చూడాల్సి వస్తుందో అని ముందుగానే డిసెబుల్ చేసినట్టు కనిపిస్తుంది. దానికి కారణం గతంలోనూ తాను రకరకాల కామెంట్ల వల్ల ఎన్నో ఇబ్బందులు ఎదురుకున్నట్టు రేణూ దేశాయ్ ఓ ఇంటర్యూలో చెప్పారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి