
ఇస్మార్ట్ శంకర్ సినిమా తో హిట్ కొట్టిన రామ్ పోతినేని ఆ తర్వాత వెంటనే రెడ్ అనే సినిమాతో ఫ్లాప్ అందుకొని మళ్లీ విజయం కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. ఈసారి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలనే ఉద్దేశంతో రామ్ పోతినేని తన తదుపరి చిత్రాన్ని తమిళ దర్శకుడు లింగుస్వామి తో చేస్తున్నాడు. తమిళనాట మాస్ దర్శకుడిగా పేరు ప్రఖ్యాతలు దక్కించుకున్న లింగుస్వామి ఇప్పటికే తెలుగు ప్రేక్షకులకు తన సినిమాలతో పరిచయం అయ్యాడు. పందెం కోడి, పందెం కోడి 2, సికిందర్ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్న లింగుస్వామి ఈ సినిమాతో తనలోని సరికొత్త మాస్ యాంగిల్ నీ చూపించబోతున్నాడు.
కృతి శెట్టి హీరోయిన్ గా నటించబోతున్న ఈ సినిమాలో రామ్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించబోతున్నాడు అని తెలుస్తుంది. ఇప్పటికే షూటింగ్ కూడా మొదలు పెట్టుకున్న ఈ సినిమా ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని భావిస్తున్నాడట. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా తప్పకుండా రామ్ కెరీర్ కు ఎంతో ప్లస్ అవుతుందని అంటున్నారు. పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కబోతున్న ఈ సినిమాలో విలన్ పాత్ర కోసం ఆ రేంజ్ వున్న నటుడి నీ చూస్తున్నారట.
ఈ నేపథ్యంలోనే తమిళనాట హీరోగా మంచి పేరు ప్రఖ్యాతలు దక్కించుకున్న ఆర్యను సంప్రదించనున్నారట. తెలుగులో వరుడు సినిమాలో విలన్ గా నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్న ఆర్యకు ఇక్కడ కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. ఆయన నటించిన చాలా తమిళ సినిమాలు తెలుగులో డబ్ అయ్యి హిట్ గా నిలిచాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమాలో ఆయన నటిస్తే బాగుంటుందని చిత్రబృందం భావిస్తున్నారట. మరి ఈ రామ్ 19వ సినిమాలు ఆర్య నటించడానికి ఒప్పుకుంటాడా చూడాలి. చిట్టూరి సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాస్ చిట్టూరి నిర్మిస్తున్న ఈ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున డం విశేషం.